భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుస్తాం: మోడీ

భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుస్తాం: మోడీ
x
Highlights

ఫ్రాన్స్ లో జరిగిన జీ7 సదస్సుకి ప్రధాని మోడీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. జీ7 దేశాల్లోని కూటమిలో భారత్‌ లేకపోయినప్పటికీ నరేంద్ర మోడీని ఫాన్స్‌ అధినేత ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఫ్రాన్స్ లో జరిగిన జీ7 సదస్సుకి ప్రధాని మోడీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. జీ7 దేశాల్లోని కూటమిలో భారత్‌ లేకపోయినప్పటికీ నరేంద్ర మోడీని ఫాన్స్‌ అధినేత ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఫ్రాన్స్‌లోని బిరియాజ్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. భారత్‌- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం మరింతగా మెరుగుపరుస్తామని మోడీ తెలిపారు.

ప్రపంచ సంక్షేమానికి భారత్‌-అమెరికా కలిసి పనిచేస్తాయని మోడీ చెప్పారు. వాణిజ్యం, రక్షణ సహకారంపై సదస్సులో ఫలవంతమైన చర్చలు జరిగాయన్నారు. భారత్‌-పాక్‌ ఎన్నో ద్వైపాక్షిక అంశాలపై పోరాటం చేయాల్సి ఉందని, ఉగ్రవాదం, పేదరికం లాంటి ఎన్నో అంశాలపై భారత్‌-పాక్‌ యుద్ధం చేయాల్సి ఉందన్నారు. భారత్‌-పాక్‌ రెండూ అమెరికాకు మిత్ర దేశాలని ట్రంప్‌ తెలిపారు. కశ్మీర్‌ విషయం భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక అంశమని.. రెండు దేశాలు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటాయని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కావడం ఆనందంగా ఉందన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. G-7 సదస్సులో భాగంగా కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు. ఇరువురు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకుని నవ్వులు పువ్వులు పూయించారు. ఈ సందర్భంగా మోడీని మంగళవారం విందుకు ఆహ్వానించారు డొనాల్డ్‌ ట్రంప్‌.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories