logo

గగనతలంపై పూర్తిగా ఆంక్షలు ఎత్తేసిన పాకిస్థాన్

గగనతలంపై పూర్తిగా ఆంక్షలు ఎత్తేసిన పాకిస్థాన్
Highlights

తమ గగనతలంపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేసినట్లు మంగళవారం పాక్ ప్రకటించింది. ఈ రోజు తెల్లవారుజామున 12.41 గంటల...

తమ గగనతలంపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేసినట్లు మంగళవారం పాక్ ప్రకటించింది. ఈ రోజు తెల్లవారుజామున 12.41 గంటల నుంచి పాకిస్తాన్ అన్ని విమానయాన సంస్థలను తన గగనతలంలో ప్రయాణించడానికి అనుమతించింది. పాక్‌ గగనతలం భారత విమానాలకు అందుబాటులోకి రానున్నట్లు పాకిస్థాన్‌ పౌర విమానయాన సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. గతంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ సర్వీస్‌ ఎటిఎస్‌‌లో ప్రచురించిన అన్ని మార్గాల్లో విమానాలు వెళ్లవచ్చునని ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌‌తో పాటు పలు దేశాలకు చెందిన పౌర విమానాలు పాక్‌ మీదుగా నిర్దేశిత మార్గంలో వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. పాక్‌ నిర్ణయంపై స్పందించిన భారత్‌ ఇరు దేశాల మధ్య అన్ని మార్గాల్లో విమానయాన ఆపరేషన్లు పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.

ఫిబ్రవరిలో బాలాకోట్‌ దాడుల తర్వాత రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్‌ తమ గగనతలాన్ని మూసివేసింది. దాదాపు అయిదు నెలల తరవాత పాక్‌ ఆంక్షల్ని ఎత్తివేసింది. పాక్‌ నిర్ణయం భారత విమానయాన సంస్థలకు ఊరటనిచ్చే విషయం. దాయాది దేశం నిర్ణయంతో జులై 2 వరకు ఎయిర్‌ ఇండియా దాదాపు 491 కోట్లు నష్టపోయింది.


లైవ్ టీవి


Share it
Top