ఘరానా దొంగలు..ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకెళ్లారు

రష్యాలో ఇనుము దొంగలు రెచ్చిపోయారు. చిన్న చిన్న దొంగతనాలు ఏన్నాళ్లు చేయాలనుకున్నారో ఏమో కానీ ఏకంగా రైల్వే...
రష్యాలో ఇనుము దొంగలు రెచ్చిపోయారు. చిన్న చిన్న దొంగతనాలు ఏన్నాళ్లు చేయాలనుకున్నారో ఏమో కానీ ఏకంగా రైల్వే బ్రిడ్జిని మాయం చేశారు. వివరాల్లోకి వెళితే రష్యాలోని ఆర్కిటిక్ రీజియన్‌లోని ఉంబా నదిపై రైల్వే బ్రిడ్జి ఉంది. బ్రిడ్జి పాత పడటంతో ఆ పక్కనే కొత్త వంతెనను నిర్మించారు. ప్రస్తుతం కొత్త మార్గం గుండానే రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. కొంతకాలంగా పాత బ్రడ్జిని వినియోగించడం లేదు. దాంతో ఎవరూ ఉపయోగించని ఆ పాత బ్రిడ్జిపై దొంగల కన్నుపడింది. ఓ మంచి ముహూర్తం చూసుకుని రంగంలోకి దిగారు. వంతెనలోని రెండు పిల్లర్ల మధ్య 75 అడుగుల నిడివిగా ఉండగా, దాన్ని మొత్తం కూల్చేసి ఇనుము మొత్తాన్ని ఎత్తుకెళ్లారు. మొత్తం 56 టన్నుల ఇనుము చోరీకి గురైంది. రెండు పిల్లర్ల మధ్య ఖాళీగా కనిపిస్తుండడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. వర్షాలు, వరదల కారణంగా ఇది కూలిపోయి ఉంటుందని మొదట అనుకున్నా, ఆ తర్వాత అది దొంగల ఘనకార్యం అని తెలిసింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
లైవ్ టీవి
నమ్మించి మోసం చేశాడు.. 45 లక్షలు కాజేసాడు
13 Dec 2019 1:15 PM GMTఏపీ రాజధానిపై ప్రభుత్వం క్లారిటీ
13 Dec 2019 12:42 PM GMTనాన్న మీరుంటే బాగుండు .. వెంకీ ఎమోషనల్ పోస్ట్
13 Dec 2019 12:39 PM GMTఇటు దిశ బిల్లు ఆమోదం.. అటు గుంటూరులో మైనర్పై అఘాయిత్యం !
13 Dec 2019 12:11 PM GMTబంపర్ ఆఫర్ కొట్టేసిన దొరసాని
13 Dec 2019 12:03 PM GMT