వారం రోజుల్లో అభినందన్ ను విడిచిపెట్టాలి.. జెనీవా ఒప్పందం మరిచారో..

వారం రోజుల్లో అభినందన్ ను విడిచిపెట్టాలి.. జెనీవా ఒప్పందం మరిచారో..
x
Highlights

ప్రస్తుతం ఇండియా పాకిస్థాన్ బోర్డర్ లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.. ఒకవైపు చర్చలంటూనే భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతూ ఉంది పాకిస్థాన్.. భారత్ దాడి...

ప్రస్తుతం ఇండియా పాకిస్థాన్ బోర్డర్ లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.. ఒకవైపు చర్చలంటూనే భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతూ ఉంది పాకిస్థాన్.. భారత్ దాడి చేసింది మనుషుల్ని చంపే మానవ మృగాలను అని మరచి వారిని వెనకేసుకురావడంతో.. కరుడుగట్టిన ఉగ్రవాదులను పాకిస్థాన్ పెంచి పోషిస్తుందున్న అభిప్రాయం నిజమైంది. ఉగ్రమూకలను మట్టుబెట్టిన కారణంగా.. మంగళవారం అర్ధరాత్రినుంచి పాకిస్తాన్‌ ఆర్మీ, వైమానిక దళాలతో భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరచి భారత సైనికులపై కాల్పులకు తెగబడింది. దీన్ని ముందుగానే పసిగట్టిన భారత బలగాలు పాకిస్తాన్‌ కుట్రను భగ్నం చేశాయి. కాగా జమ్మూలోని రాజౌరీ సెక్టార్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌–16 యుద్ధ విమానాన్ని గాల్లోనే పేల్చేశామని భారత్‌ ప్రకటించింది. దీనికి కౌంటర్ గా పాక్.. రెండు భారత విమానాల్ని నేలకూల్చామని.. ఇద్దరు పైలట్‌లను అదుపులోకి తీసుకున్నామని అబద్ధం చెప్పింది.

ఆ తరువాత మాటమార్చి తమ అధీనంలో అభినందన్ అనే ఒక పైలటే ఉన్నారని చెప్పింది. ఈ క్రమంలో భారత్.. పాక్ ను తీవ్రంగా హెచ్చరించింది.. వారం రోజుల్లో అభినందన్ ను విడిచిపెట్టకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అంతేకాకుండా భారత్‌.. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధఖైదీకి ఎలాంటి హాని తలపెట్టకుండా అప్పగించాలని గుర్తు చేసింది. పాకిస్తాన్‌ నుంచి ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాల్ని అప్రమత్తం చేసింది భారత ఆర్మీ. ఇప్పటికే లీవ్ లో ఉన్న ఆర్మీ సైనికులను వెంటనే అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించింది. ఇదిలావుంటే భారత్, పాక్ దేశాల మధ్య తలెత్తిన పరిస్థితులపై అంతర్జాతీయ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పరిష్కరించుకునేందుకు వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాలని అమెరికా, చైనా, రష్యాలు రెండు దేశాలకు సూచించాయి. మరోవైపు పాకిస్తాన్‌తో తాజా పరిస్థితిపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌..చైనా, రష్యా విదేశాంగ మంత్రులకు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories