Top
logo

ప్రపంచానికి గుడ్‌ న్యూస్‌ చెప్పిన అమెరికా..నెరవేరిన దశాబ్దాల భారతీయుల కల

ప్రపంచానికి గుడ్‌ న్యూస్‌ చెప్పిన అమెరికా..నెరవేరిన దశాబ్దాల భారతీయుల కల
X
Highlights

అగ్రరాజ్యంలో పర్మినెంట్‌గా సెటిలవ్వాలనుకునే వారికి అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. ఆ దేశంలో శాశ్వత నివాసం...

అగ్రరాజ్యంలో పర్మినెంట్‌గా సెటిలవ్వాలనుకునే వారికి అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. ఆ దేశంలో శాశ్వత నివాసం ఏర్పాటుచేసుకునేందుకు వీలు కల్పించే గ్రీన్‌కార్డు బిల్లుకు యూఎస్ కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఒక్కో దేశానికి ఏడు శాతానికి మించి గ్రీన్ కార్డులు ఇవ్వకూడదన్న నిబంధనలతో ఎన్నారైలు తమ వంతు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఆ కోటా పరిమితిని ఎత్తివేస్తూ రూపొందించిన బిల్లును సెనెట్ ప్రవేశపెట్టగా దానికి సభ ఆమోద ముద్ర వేసింది.

పెండింగ్‌లో భారతీయుల అప్లికేషన్లు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది భారతీయులు దశాబ్దాలుగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే జనాభా ఎక్కువ ఉన్న దేశాలకు తక్కువ ఉన్న దేశాలకు ఒకే నిబంధన అమలవుతుండటంతో భారత్, చైనా, ఫిలిప్పీన్స్‌కు చెందిన వలసదారుల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు గత ఫిబ్రవరిలో ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్ యాక్ట్ బిల్లును రూపొందించారు. భారత సంతతికి చెందిన సెనేటర్ కమలా హ్యారిస్, మరో ఎంపీ మైక్ లీతో కలిసి బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టారు. గూగుల్, వాల్ మార్ట్ సహా ఇతర దిగ్గజ కంపెనీలు కూడా వీటిని సమర్థించాయి.

ఎంప్లాయిమెంట్ బేస్డ్ వీసాల కింద అమెరికా ఏటా 1.4లక్షల మందికి గ్రీన్‌కార్డులు ఇస్తోంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఒక్కో దేశానికి గరిష్ఠంగా ఏడు శాతానికి మించి గ్రీన్ కార్డులు కేటాయించే అవకాశం లేదు. దీంతో ఒక్కో దేశం ఏటా ఈబీ వీసాల కింద ఒక్కో దేశానికి 9,800కు మించి గ్రీన్ కార్డులను పొందే అవకాశం లేదు. నిరీక్షణకు తెర హెచ్1బీ వీసాలతో అమెరికాకు వచ్చి గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులకు ఈ బిల్లు ఆమోదంతో మేలు జరగడం ఖాయం.

ప్రస్తుతం అమలవుతున్న విధానం ప్రకారం ఇండియన్ల అప్లికేషన్లు క్లియర్ అయ్యేందుకు కనీసం 70 ఏళ్లు పడుతుందని అంచనా. అయితే తాజా బిల్లు ఒక్కో దేశంపై ఉన్న పరిమితిని సడలించడంతో భారత్, చైనా తదితర దేశాలకు భారీ ప్రయోజనం కలుగుతుంది. తాజా బిల్లులో ఫ్యామిలీ స్పాన్సర్డ్ విభాగంలో కార్డుల జారీని 15శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. తాజా బిల్లులు చట్టరూపం దాల్చడంతో గ్రీన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ త్వరలోనే ఫలించనుంది.

అమెరికాలో భారతీయులకు ఊరట కల్పించే కీలక పరిణామమిది. మెరిట్‌-ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థను పునరుద్ధరించాలని, గ్రీన్‌కార్డు వార్షిక కేటాయింపులను 45శాతానికి పెంచాలని కోరుతూ ప్రతిపాదనను అమెరికా ప్రతినిధులు సభలో ప్రవేశపెట్టారు. తాజా బిల్లు ప్రకారం ప్రస్తుతం కేటాయిస్తున్న గ్రీన్‌ కార్డుల సంఖ్య సంవత్సరానికి కేవలం 1,20,000 నుండి 1,75,000 వకు మాత్రమే ఉంటాయి. ఇక బిల్లు పాసవడంతో ఈ సంఖ్య సుమారు 5లక్షలకు చేరుకోనుంది.

అమెరికా సెనెట్‌ నిర్ణయంతో గ్రీన్‌కార్డు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నది కొందరు ప్రవాస భారతీయుల మాట. శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన భారత్‌-అమెరికా వాసులే అధికంగా హెచ్‌-1బీ వీసాపై అమెరికాలో ఉన్నారు. ఐటీ ఇంజినీర్లుగా అడుగుపెడుతున్న ప్రతీ ఒక్క భారతీయుడు గ్రీన్‌ కార్డు హోందా పొందుతున్నాడు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎన్నారైలు ఆనందంతో ఉన్నారు.

అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న వారిలో ఎక్కువ మంది ఇండియన్సే. ట్రంప్‌ సర్కార్‌ మద్దతుతో ప్రతినిధుల సభ ముందుకు చేరిన బిల్లు ముందుకు సాగి ట్రంప్‌ సంతకం పూర్తవడంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్టయిందంటున్నారు ఇండో అమెరికన్లు. ఈ బిల్లు తమ సరిహద్దులను సురక్షితంగా ఉంచుతుందంటున్నారు. ఎలాంటి ట్యాక్సు లేకుండా రెన్యూవల్‌ చేసే విధంగా తాత్కాలిక వీసాను ఉద్యోగుల తల్లిదండ్రుల కోసం తీసుకొచ్చింది సెనెట్‌. అలాంటిది బిల్లు చట్టం కావడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమయ్యే అవకాశాలున్నాయి.

అమెరికాలో స్థిర నివాసం ఏర్పర్చుకున్న వారిలో అత్యధికంగా మెక్సికో వాళ్లు ఉండగా, అతి తక్కువగా పాకిస్థానీయులు ఉన్నారు. మెక్సికో నుంచి 1,58,619 మంది, చైనా నుంచి 74,558 మంది, ఇండియా నుంచి 64,116 మంది, పిలిఫిన్స్‌ నుంచి 56,478, క్యూబా నుంచి 54,396, డోమినికన్‌ రిపబ్లికన్‌లు 50,610, వియత్నాం నుంచి 30,832, ఇరాక్‌ నుంచి 21,107 మంది, సల్వేడర్‌ 19,478 మంది, పాకిస్థాన్‌ నుంచి 18,057 మంది నివాసం ఉంటున్నారు.

ప్రతినిధుల సభలో మొత్తం 435 మంది సభ్యులకు గాను రిపబ్లికన్, డెమొక్రాట్‌ పార్టీకి చెందిన 310 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. 203 మంది డెమొక్రాట్లు, 108 మంది రిపబ్లికన్లు ఈ బిల్లుకు కో స్పాన్సరర్లుగా ఉన్నారు. 290 ఓట్లు బిల్లుకు అనుకూలంగా వస్తే దీనిపై ఎలాంటి చర్చలూ, సవరణలూ లేకుండా బిల్లు ఆమోదం పొందుతుంది.

Next Story