logo

లైవ్ లో కొట్టుకున్నారు!

లైవ్ లో కొట్టుకున్నారు!fight in live show in pakisthan tv
Highlights

రాజకీయ నాయకులు అర్థవంతంగా మాట్లాడటమే కష్టం. అందులోనూ టీవీ డిబేట్ లలో ఎదో ఒకటి మాట్లాడేస్తుంటారు. దాంతో.....

రాజకీయ నాయకులు అర్థవంతంగా మాట్లాడటమే కష్టం. అందులోనూ టీవీ డిబేట్ లలో ఎదో ఒకటి మాట్లాడేస్తుంటారు. దాంతో.. ఒక్కోసారి ఆ షోలు రసాభాసగా మారటం మనకు తెల్సిందే. అయితే, పాకిస్తాన్ లో ఇటువంటి షో ఒకటి కొట్టుకునే వరకూ వెళ్ళింది. ఓ న్యూస్ ఛానల్ చర్చాకార్యక్రమంలో ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుప్పించుకున్నారు.

ధికార పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ- ఇన్సాఫ్‌ (పీటీఐ) నేత మసూర్‌ అలీ సియాల్‌, కరాచి ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఇంతియాజ్‌ ఖాన్‌ ల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ చర్చా కార్యక్రమంలో ప్రభుత్వంపై ఇంతియాజ్ విమర్శలు గుప్పిస్తుండగా, ఇద్దరు నేతల మధ్యా మాటమాట పెరిగింది. సహనం కోల్పోయిన మసూర్‌ అలీ అతన్ని కొట్టారు. దీంతో ఇంతియాజ్ సైతం ప్రతిదాడికి దిగారు. దీంతో చర్చా కార్యక్రమం రసాభసగా మారగా, ఈ మొత్తం ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వీరిని విడదీసేందుకు యాంకర్‌ తో పాటు కార్యక్రమ నిర్వాహకులు కలుగజేసుకోవాల్సి వచ్చింది. ఫైటింగ్ తరువాత మసూర్‌ లైవ్ ను కొనసాగించగా, ఇంతియాజ్ మాత్రం వెళ్లిపోయారు. ఆ తరువాత చానెల్‌ తన లైవ్ షోను కొనసాగించింది. ఈ వీడియోను పాక్‌ కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్‌ తన ట్విట్టర్ ఖతాలో షేర్ చేసుకున్నారు. "దాడిచేయడమేనా నయాపాకిస్తాన్‌" అని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు.


లైవ్ టీవి


Share it
Top