రూ. 270 కోట్లతో.. దుబాయ్ రాజు భార్య పరారీ

రూ. 270 కోట్లతో.. దుబాయ్ రాజు భార్య పరారీ
x
Highlights

రాజుగారి పట్టపురాణి పరాయి దేశానికి తుర్రముంది. భార్తకు హ్యాండ్‌ ఇచ్చి క్యాష్‌తో ఎస్కేప్‌ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 270 కోట్లతో చెక్కిసేంది. ఓ...

రాజుగారి పట్టపురాణి పరాయి దేశానికి తుర్రముంది. భార్తకు హ్యాండ్‌ ఇచ్చి క్యాష్‌తో ఎస్కేప్‌ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 270 కోట్లతో చెక్కిసేంది. ఓ దేశపు యువరాణి మరో దేశరాజుకు హాఫ్ సిస్టర్ ఎవరికి తెలియకుండా హద్దులు చేరిపేసి జారుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ముస్లిం దేశాల్లో రూల్స్‌ ఎంత కఠినంగా ఉంటాయో వాటిని బ్రేక్‌ చేస్తే అంతే స్ట్రాంగ్‌గా పనిష్మెంట్‌ విధిస్తారు. ఇక లేడిస్‌పై పెట్టే ఆంక్షలు వింటే కరెంట్‌షాక్‌ తగులుతోంది. భర్త అనుమతి లేకుండా కాలు బయట పెట్టినా పెద్ద నేరమే. అలాంటి ముస్లిం దేశయువరాణే రూల్స్‌ను భేఖాతరు చేసి పారిపోవడం కలకలం రేపుతోంది.

దుబాయ్ రాజు యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భార్య ప్రిన్సెస్ హయా అల్ హుస్సేన్ ఎవరికీ తెలియకుండా ఎస్కేప్‌ అయ్యారు. దుబాయ్ నుంచి లండన్‌కు చెప్పపెట్టకుండా చెక్కేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. 2004లో షేక్ మహమ్మద్‌తో హయాకు వివాహమైంది. అయితే భర్త షేక్ మహమ్మద్‌తో ఇటీవల తెగదెంపులు చేసుకున్న హయా 270 కోట్ల ఆస్తితో లండన్‌కు తుర్రుమంది. రాత్రికి రాత్రే బిడ్డలతో కలిసి చెప్పాపెట్టకుండా భారీ సొత్తుతో వెళ్లిపోవడంపై షేక్ మహమ్మద్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తనను మోసం చేసి ఎవరి కోసం లండన్ వెళ్లావ్ అంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో ఫైరయ్యారు.

జర్మనీకి చెందిన ఓ దౌత్యవేత్త సాయంతో హయా లండన్‌కు వెళ్లేందుకు సహాయపడినట్టు తెలుస్తోంది. తనకు జర్మనీలో ఆశ్రయం కల్పించాలని అక్కడి ప్రభుత్వాన్ని హయా కోరినట్టు వార్తలొస్తున్నాయి. కాగా హయా జోర్డన్ రాజుకు హాఫ్ సిస్టర్ అవుతుందట. భర్త నుంచి విడాకులు తీసుకున్న హయా కొత్తలైఫ్‌ను స్టార్ట్‌ చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దుబాయ్‌లో హయా ప్రాణాలకు ముప్పు ఉందనే ఈ పని చేసినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై అటు లండన్ ప్రభుత్వం కాని ఇటు దుబాయ్ ప్రభుత్వం కాని రియాక్ట్‌ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దుబాయ్, జర్మనీ మధ్య దౌత్య వైరుధ్యాల నేపథ్యంలో తన భార్య ను తిరిగి అప్పగించాలన్నఅభ్యర్థనను జర్మనీ తోసిపుచ్చినట్టు వార్తలొచ్చా యి.

గతేడాది షేక్ మహమ్మద్ కూతురు ప్రిన్సెస్ లతిఫా పారిపోయేందుకు యత్నించగా ఇండియ న్ కోస్ట్‌లో పట్టుకున్నారు. అప్పటినుంచి ఆమెను దుబాయిలో బందీగా ఉంచారని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూతురు లాగే హయా కూడా భర్త వేధింపులు తట్టుకోలేక అదే పని చేసిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజుగారి భార్య ఎవరికి చెప్పకుండా పారిపోవడం సంచలనంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories