భార్యకు తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని రోడ్డుపై నిలబడ్డాడు.. చివరకు..

భార్యకు తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని రోడ్డుపై నిలబడ్డాడు.. చివరకు..
x
Highlights

ప్రేయసికి తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ప్రేమికుడు బిజీ రోడ్డు మధ్యలో నుంచి కళ్ళుమూసుకుని వెళ్లే సీన్లు మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం.. అయితే...

ప్రేయసికి తనపై ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి ప్రేమికుడు బిజీ రోడ్డు మధ్యలో నుంచి కళ్ళుమూసుకుని వెళ్లే సీన్లు మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం.. అయితే అది సినిమా అందునా గ్రాఫిక్స్.. ఇదే తరహా సాహసం ఓ వ్యక్తి నిజ జీవితంలోనే జరిగింది. చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోని లిషుయ్‌లో పాన్ అనే ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత రోడ్డుపైనే ఇద్దరూ కాసేపు తిట్టుకున్న తర్వాత పాన్ వెళ్లి బిజీ రోడ్డు మధ్యలో నిల్చున్నాడు. భార్య తనను ఎంత లాగడానికి ప్రయత్నించినా.. అతను మాత్రం అలాగే అక్కడ నిలబడి ఉండటానికి ప్రయత్నించాడు.

సినిమాల్లోని వేషాలు నిజజీవితంలో కుదరవు అన్నట్టు.. రోడ్డుపై నిలుచున్న ఆ వ్యక్తిని ఓ వ్యాన్ వచ్చి ఢీకొట్టింది. దాంతో అతని తల, ఛాతీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాపై నిజంగా నా భార్యకు ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని రోడ్డుపై నిల్చున్నాను. చివరికి ఇలా అయింది అంటూ స్నేహితులతో అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories