Top
logo

ప్రపంచం అంతా భారత్‌ వైపు.. చంద్రయాన్-2కి ఏర్పాట్లు పూర్తి.. ఆదివారం అర్థరాత్రి అద్భుతం

ప్రపంచం అంతా భారత్‌ వైపు.. చంద్రయాన్-2కి ఏర్పాట్లు పూర్తి.. ఆదివారం అర్థరాత్రి అద్భుతం
X
Highlights

యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న మధుర‌ క్షణాలు దగ్గరపడుతున్నాయి. జాబిలమ్మ చెంతకు మానవరహిత నౌకను చేర్చేందుకు...

యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న మధుర‌ క్షణాలు దగ్గరపడుతున్నాయి. జాబిలమ్మ చెంతకు మానవరహిత నౌకను చేర్చేందుకు ఇస్రో వేస్తున్న అడుగులు వేగం పుంజకున్నాయి. పదేళ్ల కల మరో రెండ్రోజుల్లో సాకారం కానుంది. మన రాకెట్ చందమామ వైపు నిప్పులు చిమ్ముతూ దూసుకుపోనుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎదురులేని విజయాలతో దూసుకుపోతోన్న మరికొన్ని గంటల్లో చంద్రయాన్ - 2 ప్రయోగాన్ని పట్టాలెక్కించనుంది. మరో రికార్డ్‌ కు సిద్ధమవుతున్న చంద్రయాన్2 పై హెచ్‌ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

వరుస విజయాలతో దూకుడు మీదున్న ఇస్రో మరో ఘనత సాధించేందుకు సిద్ధమవుతోంది.. మంగళయాన్, చంద్రయాన్ వంటి అనేక ప్రతిష్ఠాత్మక ప్రయోగాలతో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఇస్రో తాజాగా చంద్రయాన్-2 ప్రయోగానికి రెడీఅవుతోంది. జాబిలిపైకి మానవున్ని పంపాలని టార్గెట్‌గా పెట్టుకున్న ఇస్త్రో 2022లో మానవసహిత గగన్‌యాన్ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని ఫిక్సై పోయింది. చంద్రయాన్‌ వన్‌లో చంద్రుడిపై మంచు ఉందని కనుగొన్న ఇస్రో..ఇప్పుడు మరిన్ని రహస్యాలను ఛేదించడానికి సిద్ధమైంది. చంద్రుడిపై మట్టి, రాళ్లను చంద్రయాన్‌ టూలో పరిశీలించనున్నారు.

జాబిలమ్మ యాత్రకు మన శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకొనే రీతిలో చందమామ రూపురేఖా, విలాసాలు తెలుసుకొనే రీతిలో చంద్రయాన్-2 యాత్ర మరి కొన్ని గంటల్లో ప్రారంభకానుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 15న జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3-ఎం 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగం చేపట్టునున్నారు. ఒకప్పుడు చందమామపై నీటి జాడలు ఉన్నాయని చంద్రయాన్-1 ఉపగ్రహం ద్వారా కనిపెట్టిన ఇస్రో ఇప్పుడు చందమామ దక్షిణ ధ్రువంపై ఫోకస్ పెడుతూ చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఎల్లుండి తెల్లవారు జామున 2.51 గంటలకు చంద్రయాన్-2 శాటిలైట్‌ని నింగిలోకి పంపబోతోంది. GSLV-Mark 3M 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగం జరగబోతోంది. ఇప్పటికే ఓసారి రిహార్సల్ 100 శాతం సక్సెస్‌ఫుల్‌గా పూర్తైంది. మరోసారి రిహార్సల్ నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రారంభించనుంది.

ఇప్పటికే చంద్రయాన్‌-2 ప్రయోగం కోసం ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. బెంగుళూరులో ఇస్రోకు చెందిన శాటిలైట్ ఇంటిగ్రేష‌న్ అండ్ టెస్టింగ్ సెంట‌ర్‌లో చంద్రయాన్‌-2కు సంబంధించిన ప‌రికరాలను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ల్యాండ‌ర్‌, ఆర్బిటార్ మాడ్యుళ్లలో ప‌రిక‌రాల‌ను బిగించారు. దీంతో చంద్రయాన్-2 ప్రయోగం పై పదేళ్ల కసరత్తు చేసిన ఇస్త్రో కల నెరవేరనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చంద్రయాన్-2 మిషన్‌ను రూపకల్పనం చేశారు. 15న యాత్ర మొదలుపెట్టి ఐదు రోజుల తర్వాత భూ నియంత్రిత చంద్రుడి కక్ష్యలోకి వస్తుంది. ఆ తర్వాత 16 రోజుల పాటూ కక్ష్యామార్గాన్ని వివిధ దశల్లో సెట్ చేస్తారు. ఆ తర్వాత 27 రోజుల పాటూ చందమామ చుట్టూ తిరుగుతుంది. ఆ టైంలో ఆర్బిటర్ నుంచీ విడిపోయే ల్యాండర్ చందమామవైపు పయనించి సెప్టెంబర్ 6 లేదా 7న చందమామ దక్షిణ ధ్రువంపై వాలుతుంది. సోలార్ పవర్‌తో పనిచేస్తూ పరిశోధనలు చేయనుంది.

భారత్‌కు తన ఉపగ్రహం ముద్రను చంద్రుడిపై వేయడానికి ఇది చాలా కీలకమైన మిషన్. చంద్రయాన్ - 2 ప్రయోగం ద్వారా పంపించే రోవర్లు చంద్రుడిపై చీకటి కోణాన్ని అన్వేషించనున్నాయి. ఈ ప్రయోగం ద్వారా సేకరించే సమాచారంపై ప్రపంచ నలుమూలలా ఉన్న శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో గగయయాన్‌కు సిద్ధమవుతున్న ఇస్రోకు ఆల్ ది బెస్ట్ చెబుతోంది యాత్‌ దేశం.

Next Story