చంద్రయాన్‌ 2కి సర్వం సిద్ధం

చంద్రయాన్‌ 2కి సర్వం సిద్ధం
x
Highlights

చిన్నపిల్లలకు చందమామను చూపించి అన్నం తినిపిస్తారు.. చందమామరావే జాబిల్లిరావే అని పాటలు పాడుతుంటారు.. ప్రేమికులకు ఉల్లాసం.. కవులకు ఉత్తేజం చమదమామ...

చిన్నపిల్లలకు చందమామను చూపించి అన్నం తినిపిస్తారు.. చందమామరావే జాబిల్లిరావే అని పాటలు పాడుతుంటారు.. ప్రేమికులకు ఉల్లాసం.. కవులకు ఉత్తేజం చమదమామ మనకెంతో ఇష్టమైన చంద్రుడి గురించి శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. మానవుడు ఎప్పుడో చంద్రుడిపై కాలు పెట్టాడు. కానీ ఇప్పటివరకూ చంద్రుడి రహస్యాలు పూర్తిగా బయటపడలేదు. అందినట్లే అంది అర్థం కాకుండా ఊరిస్తున్నాడు చంద్రుడు. అలాంటి చంద్రుడి రహస్యాలను తెలుసుకునేందుకు ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2 మిషన్‌ ద్వారా చంద్రుడిపై అద్భుతమైన ప్రయోగాలకు మన శాస్త్రవేత్తలు తమ మేథకు పనిపెడుతున్నారు. చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు ఇది తొలిసారి కాదు. 2008లోనూ శ్రీహరికోట నుంచి లాంచ్ అయిన చంద్రయాన్-1ను చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది మన ఇస్రో. ఇది చంద్రునిపై నీటి జాడను కూడా కొనుగొంది. చంద్రుడిపైకి రోవర్ ప్రయోగం ఇప్పుడు చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా చంద్రునిపై ఏకంగా ఓ రోవర్‌ను దించాలనేది ఇస్రో లక్ష్యం.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రగ్రహంపైకి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III వాహకనౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. దీని ద్వారా చంద్రగ్రహంపైకి ఆర్బిటార్‌, ల్యాండ‌ర్‌, రోవర్‌‌ను ప్రవేశపెట్టనున్నారు. ల్యాండర్‌కు విక్రమ్ అని, రోవర్‌కు ప్రగ్యాన్ అని నామకరణం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. భారత కీర్తికిరీటంలో మణిహారం వంటి చంద్రయాన్ 2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. చంద్రుడిపై రహస్యాలను శోధించి మరోసారి భారత జెండాను రెపరెపలాడించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రెడీ అయింది. చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు, అక్కడి ఖనిజ వనరులు, నీరు, ఇంధన నిల్వలను విశ్లేషించేందుకు చంద్రయాన్-2ను చేపట్టనున్నారు. ఈనెల 15 తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.

జీఎస్ఎల్వీ మార్క్-3 వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఇందులో ముఖ్యంగా మూడు పరికరాలు.. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లు ఉంటాయి. చంద్రయాన్-2 వ్యవస్థ మొత్తం బరువు 3,447 కేజీలు కాగా, వీటిలో ఒక్క ప్రొపెల్లర్ బరువే ఏకంగా 1,179 కేజీలు ఉంటుంది. ఓసారి ఉపగ్రహాన్ని ప్రయోగించాక, ఇది స్వతంత్రంగా వ్యవహరిస్తూ ముందుకు సాగిపోతుంది. సెప్టెంబర్ 6 లేదా 7 తేదీల్లో ల్యాండర్ చంద్రుడిపై దిగే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు ఖ‌రీదు వెయ్యి కోట్లు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్ 2ను ప్రయోగించనున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. ఆర్బిటార్ ప్రొపలేషన్ మాడ్యూల్ ద్వారా మూన్ ఆర్బిట్‌లోకి శాటిలైట్ ప్రవేశించనుంది. ఆ తర్వాత ఆర్బిటార్ నుంచి ల్యాండ్ వేరుపడి చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగుతుంది. శాస్త్రీయ పరీక్షల కోసం రోవర్ అక్కడ తిరగనుంది. చంద్రయాన్ 2 ప్రయోగం ద్వారా 11 పేలోడ్స్ తీసుకెళ్లనున్నారు. వాటిలో 6 భారత్‌కు చెందినవి కాగా యూరప్‌కు చెందినవి, అమెరికావి 2 ఉన్నాయి.

తారాజువ్వ ఆకాశంలోకి దూసుకెళ్తుంటే చూసి ఆనందపడతాం. అదే నిజమైన రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లడాన్ని ప్రత్యక్షంగా చూస్తే.. మన ఆనందానికి అవధులు ఉండవు. అయితే, ఆ సందర్భాన్ని వీక్షించేందుకు ఇస్రో, నాసా లాంటి ప్రయోగ సంస్థలు సాధారణ ప్రజలకు అనుమతి ఇవ్వవు. టీవీల్లో చూసి ఆనందపడాల్సిందే. అయితే, సాధారణ ప్రజలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. చంద్రయాన్2ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం కల్పించడం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories