logo

ఇంతవరకూ ఏ అమెరికా అధ్యక్షుడూ అక్కడ కాలు పెట్టలేదు..ట్రంప్ మొదటిసారి!

ఇంతవరకూ ఏ అమెరికా అధ్యక్షుడూ అక్కడ కాలు పెట్టలేదు..ట్రంప్ మొదటిసారి!
Highlights

'మరోసారి మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. ఈ ప్రదేశంలో మనం కలుస్తామని నేను ఎన్నడూ ఊహించలేదు'' - ఉత్తర కొరియా...

"మరోసారి మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. ఈ ప్రదేశంలో మనం కలుస్తామని నేను ఎన్నడూ ఊహించలేదు'' - ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్.

"మా మధ్య గొప్ప స్నేహబంధం ఉంది. పరస్పరం మొదటినుంచి ఒకరంటే ఒకరం ఇష్టపడుతున్నాం. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నందుకు గర్వపడుతున్నాను"

- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్

ఇదీ.. ఉప్పు నిప్పులా ఉండే ఇద్దరు దేశాధినేతలు ఒకరికోసం ఒకరు చెప్పిన సంగతులు.

ఇదంతా ఎక్కడంటే.. దక్షిణ, ఉత్తర కొరియాల సరిహద్దుల్లోని నిస్సైనిక ప్రాంతం (డీఎంజెడ్‌)లో ఈ ఇరు నేతలు కలిశారు. ఇరువురు నేతలు కాసేపు మాట్లాడుకున్నారు. అంతేకాదు.. ఇంత వరకూ ఏ అమెరికా అధ్యక్షుడు చేయని పని ట్రంప్ చేశారు. సరిహద్దుకి అటుగా ఉన్న ఉత్తరకొరియా భూభాగంలోకి కిమ్‌తో కలిసి ట్రంప్‌ అడుగుపెట్టారు. అనంతరం కొద్దిసేపటికి మళ్లీ వెనక్కి తిరిగి కిమ్‌తో కలిసి దక్షిణ కొరియా భూభాగంలో అడుగుపెట్టారు. ఇంతవరకు ఏ అమెరికా అధ్యక్షుడు ఉత్తరకొరియాలో అడుగుపెట్టలేదు. సరిహద్దుకి అటుగా ఉన్న ఉత్తరకొరియా భూభాగంలోకి కిమ్‌తో కలిసి ట్రంప్‌ అడుగుపెట్టారు. అనంతరం కొద్దిసేపటికి మళ్లీ వెనక్కి తిరిగి కిమ్‌తో కలిసి దక్షిణ కొరియా భూభాగంలో అడుగుపెట్టారు. ఇంతవరకు ఏ అమెరికా అధ్యక్షుడు ఉత్తరకొరియాలో అడుగుపెట్టలేదు. ''ఇది చాలా ధైర్యవంతమైన పని'' అని కిమ్‌ ఈ సందర్భంగా ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జె ఇన్‌తో కూడా కిమ్‌ కరచాలనం చేశారు. ముగ్గురు నేతలు చిరునవ్వులు చిందిస్తూ ముచ్చట్లు చెప్పుకున్నారు. ఈ మూడు దేశాల నేతలు ఒకేసారి కలవడం ఇదే మొదటిసారి. ఈ భేటీ భవిష్యత్తులో జరిపే చర్చలపై సానుకూల ప్రభావం చూపుతుందని కిమ్‌ అన్నారు. ''ఉత్తరకొరియాలో అడుగుపెట్టినందుకు గర్వంగా ఉంది'' అని ట్రంప్‌ అన్నారు.

లైవ్ టీవి

Share it
Top