logo
జాతీయం

జీవితాలను నాశనం చేస్తున్న వైట్‌నర్‌...మత్తులో హత్యలు, అత్యాచారాలు

X
Highlights

వైట్‌నర్‌ జనం జీవితాలను చిత్తు చేస్తోంది. పేపర్‌పై రాతను చెరిపేసేందుకు వాడే వైట్‌నర్‌...ప్రాణాలు తీస్తోంది....

వైట్‌నర్‌ జనం జీవితాలను చిత్తు చేస్తోంది. పేపర్‌పై రాతను చెరిపేసేందుకు వాడే వైట్‌నర్‌...ప్రాణాలు తీస్తోంది. వైట్‌నర్‌కు అలవాటు పడ్డ వారు...మత్తులో మరొకరి ప్రాణాలు తీస్తున్నారు. తెలిసి కొందరు పీల్చేస్తుంటే...తెలియక మరి కొందరు వాడుతున్నారు. దీంతో వైట్‌నర్‌ వాడే వారి ఆలోచన విధానం కూడా డిఫరెంట్‌గా‌ ఉంటోంది. ఇదొక్కటే కాదు...నెయిల్ పాలిష్‌ రిమూవర్, పంచర్లు వేసేందుకు వాడే సొల్యూషన్‌లోనూ భారీ స్థాయిలో మత్తు పదార్థాలు ఉన్నాయ్. వీటికి అలవాటు పడిన వ్యసనపరులు...దాన్నుంచి బయటకు రాలేకపోతున్నారు.

హెరాయిన్స్, డ్రగ్స్‌, గంజాయిలే కాదు...వైట్‌నర్‌, నెయిల్ పాలిష్‌ రిమూవర్, పంచర్లకు వాడే సొల్యూషన్‌లు...ప్రమాదంకరంగా మారాయ్. ఆఫ్జల్‌గంజ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన హత్య కూడా వైట్‌నర్ తాగిన మత్తులోనే చేసినట్లు పోలీసులు తేల్చారు. వైట్‌నర్‌ను కర్చీప్‌కు వేసి...ముక్కుతో పీల్చితే మత్తులోకి వెళ్లిపోతారు. వైట్‌నర్, పంచర్‌ సొల్యూషన్‌, నెయిల్ పాటిష్ రిమూవర్‌కు బానిసలు మారిన వారు...కొత్త వారికి అలవాటు చేస్తూ...జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. గంజాయి, డ్రగ్స్‌ కంటే తక్కువ ధరకే లభిస్తుండటంతో ఎక్కువ మంది వైట్‌నర్, సొల్యూషన్‌, నెయిల్ పాలిష్ రిమూవర్లను ఆశ్రయిస్తున్నారు.

యువకులు, మహిళలే కాదు...వీధి బాలలు కూడా వైట్‌నర్‌ను వినియోగిస్తున్నారు. ఒక్కసారి ఈ మత్తు పదార్థాలను పీల్చారంటే...వారి ప్రవర్తన మొత్తం మారిపోతుంది. వైట్‌నర్‌ను పీల్చిన వారు రైలు పట్టాలు, బస్టాండ్లు, డంపింగ్ యార్డులు...ఇలా ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు. వీటిని తీసుకున్న వారి ప్రవర్తన డిఫరెంట్‌గా ఉంటుంది. అంతేకాదు మత్తులో అత్యాచారాలకు పాల్పడి ఘటనలు కూడా ఉన్నాయ్.

భాగ్యనగరంలో వైట్‌నర్‌కు వెయ్యి మందికి పైగా బానిసలుగా మారినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు నిర్వహించిన దాడుల్లో...వందల మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారి వివరాలు సేకరించి...ప్రత్యేక నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నారు.

Next Story