Top
logo

టెస్ట్ క్రికెట్టే అసలు క్రికెట్ అంటున్న విరాట్

Highlights

క్రికెట్లో మూడురకాల ఫార్మాట్లు ఉన్నా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్టే అసలైన క్రికెట్ అని టీమిండియా కెప్టెన్ విరాట్...

క్రికెట్లో మూడురకాల ఫార్మాట్లు ఉన్నా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్టే అసలైన క్రికెట్ అని టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ చెప్పాడు. ఢిల్లీ యువక్రికెటర్లందరూ సాంప్రదాయ క్రికెట్ ఆడటానికే ప్రాధాన్యం ఇవ్వాలని కోరాడు. ఢిల్లీలో డీడీసీఏ నిర్వహించిన మాజీ కెప్టెన్ల సన్మాన కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్ బిషిన్ సింగ్ బేడీ, అంజుమ్ చోప్రా లాంటి మాజీ దిగ్గజ క్రికెటర్లతో కలసి కొహ్లీ పాల్గొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 51 సెంచరీలు సాధించిన కొహ్లీని ఢిల్లీ క్రికెట్ సంఘం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా యువక్రికెటర్లకు కొహ్లీ పలు విలువైన సలహాలు ఇచ్చాడు. రంజీట్రోఫీ, దులీప్ ట్రోఫీ లాంటి సాంప్రదాయ టోర్నీలలో
పాల్గొనటానికి ఆసక్తి చూపాలని కోరాడు.

Next Story