logo
జాతీయం

రైల్వే స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్య

Highlights

నగరంలోని సకుర్‌ బస్తీ రైల్వే స్టేషన్‌లో సిక్కు యువకుడు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం చోటు...

నగరంలోని సకుర్‌ బస్తీ రైల్వే స్టేషన్‌లో సిక్కు యువకుడు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంటల్లో కాలిపోతున్న యువకుడిని చూసిన సహచర ప్రయాణీకులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించకుండా ఫోన్‌లలో ఘటనను చిత్రీకరించారు.

ఆత్మహత్య చేసుకున్న యువకుడు గంట సమయం ముందే రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బ్యాగులో వెంటతెచ్చుకున్న కిరోసిన్‌ బాటిల్‌ను ఓపెన్‌ చేసి మీద పోసుకుని నిప్పటించుకున్నట్లు రైల్వే పోలీసులు చెప్పారు. యువకుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Next Story