logo
సినిమా

సెక్స్‌ రాకెట్‌.. మహిళా సంఘాల మండిపాటు

సెక్స్‌ రాకెట్‌.. మహిళా సంఘాల మండిపాటు
X
Highlights

టాలీవుడ్ పెద్దలపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. సినిమా అవకాశాల పేరుతో మహిళలపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణా...

టాలీవుడ్ పెద్దలపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. సినిమా అవకాశాల పేరుతో మహిళలపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణా జరుగుతున్నాయని సామాజికవేత్త దేవి ఆరోపించారు. సినీరంగంలో మహిళలను ఆట వస్తువులుగా భావిస్తున్నా తగిన చర్యలు తీసుకోవడంలో సినీ పెద్దలు విఫలమయ్యారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో వ్యభిచార ముఠా నడిపి టాలీవుడ్ పరువు తీసిన కో డైరెక్టర్ కిషన్ దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దేవి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ల పేర్లు వినబడుతున్నా సిని'మా' పెద్దలు ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనలో పాత్రధారుల వెనక ఉన్న అసలు సూత్రదారులెవరో తేల్చాలంటూ మా పెద్దలను డిమాండ్ చేశారు.

Next Story