Top
logo

ఫోన్ నెంబర్ అడిగాడని క్యాబ్ లోనుంచి దూకేసిన యువతి

ఫోన్ నెంబర్ అడిగాడని క్యాబ్ లోనుంచి దూకేసిన యువతి
X
Highlights

క్యాబ్ డ్రైవర్ ఫోన్ నెంబర్ అడగడంతో ఓ మహిళ కదులుతున్న క్యాబ్ నుంచి దూకింది.. దీంతో గాయాలపాలైంది. ఈ ఘటన...

క్యాబ్ డ్రైవర్ ఫోన్ నెంబర్ అడగడంతో ఓ మహిళ కదులుతున్న క్యాబ్ నుంచి దూకింది.. దీంతో గాయాలపాలైంది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని కపషెరకు చెందిన 19ఏళ్ల యువతి మండిహౌస్‌ నుంచి తన ఇంటికి వెళ్లడానికి క్యాబ్‌ ఎక్కింది. కొద్దిసేపటి తర్వాత క్యాబ్‌ డ్రైవర్‌ ఆమె ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగాడు ఆమె దానికి నిరాకరించింది. ఈ క్రమంలో క్యాబ్ డ్రైవర్ ఆమెను మరింత బలవంతపెట్టాడు నీతో స్నేహం చెయ్యాలని ఉందని ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా బ్రతిమాలాడాడు.దీంతో భయాందోళన చెందిన యువతి అతను ఏదైనా చేస్తాడేమోనని కదులుతున్న క్యాబ్ నుంచి దూకేసింది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకుని గాయాలతో బయటపడింది. ఈ ఘటనపై సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Next Story