వందో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న మాతృమూర్తి

x
Highlights

మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల మనస్తత్వాలు మారుతున్న నేటి రోజుల్లో ఓ మాతృమూర్తికి వందేళ్ల పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపి అమ్మప్రేమకు ఆదర్శంగా...

మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల మనస్తత్వాలు మారుతున్న నేటి రోజుల్లో ఓ మాతృమూర్తికి వందేళ్ల పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపి అమ్మప్రేమకు ఆదర్శంగా నిలిచింది ఓ కుటుంబం. ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులంతా పాల్గొని మాతృమూర్తి ఆశీర్వాధాలు పొందారు.

ఈ మాతృమూర్తి అక్షరాల వందఏళ్లు పూర్తి చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మర్రిచెట్టు తండాకు చెందిన చాందిబాయి జన్మించి వంద సంవత్సరాలు నిండటంతో ఆమె కుటుంబ సభ్యులు పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. చాందిబాయికి 5గురు కొడుకులు, నలుగురు బిడ్డలు ఉన్నారు. నాలుగు తరాలకు పెద్దదిక్కుగా ఉంది చాందిబాయి.

వందేళ్ల క్రితం పుట్టిన చాందిబాయి తమ పిల్లలందరిని ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేసింది. అమ్మ చలువతోనే తాము ఈ స్థాయిలో ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నారు ఆమె కుమారుడు. వృద్దాప్యం చేరుకున్న తల్లిదండ్రులను ఎవరూ దూరం చేసుకోవద్దని నేటి తరానికి సూచిస్తున్నారు.

చాందిబాయి ఆనాటి నుంచి నేటి వరకు తింటున్న ఆహారపు అలవాట్లతోనే ఇంత యాక్టీవ్ గా ఉందంటున్నారు ఆమె సోదరుడు హితిరామ్ నాయక్. ఎవరిపై ఆధారపడకుండా తనపని తాను చేసుకుంటూ అందరికి మార్గదర్శంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. చాందిబాయి వందో పుట్టిన రోజు వేడుకలకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులంతా హాజరయ్యారు. ఎంతో అల్లారుముద్దుగా కనిపెంచిన తల్లిదండ్రులను వయస్సుపైబడగానే వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న వారు చాందిబాయి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories