Top
logo

యువతిపై పోలీస్‌ వాహనంలోనే కుమ్మేసిన పోలీసులు...హిందువులు ఉండగా…నీకు ముస్లిమే దొరికాడా అంటూ

యువతిపై పోలీస్‌ వాహనంలోనే కుమ్మేసిన పోలీసులు...హిందువులు ఉండగా…నీకు ముస్లిమే దొరికాడా అంటూ
X
Highlights

గుంపుదాడి నుంచి యువతిని రక్షించిన పోలీసులే యువతిపై దాడికి పాల్పడ్డారు. ఓ ముస్లిం యువకుడితో ఫ్రెండ్ షిప్...

గుంపుదాడి నుంచి యువతిని రక్షించిన పోలీసులే యువతిపై దాడికి పాల్పడ్డారు. ఓ ముస్లిం యువకుడితో ఫ్రెండ్ షిప్ చేస్తోందన్న కారణంతో దారుణంగా కొట్టారు పోలీసులు. ముస్లిం అంత నచ్చాడా అంటూ పోలీసు వాహనంలో కుమ్మేశారు. యూపీ మీరట్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాపంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఓ ముస్లిం యువకుడి ఇంట్లోకి చొరబడిన కొంత మంది వీహెచ్ పీకి చెందిన వ్యక్తులు ఇంట్లో క్లాస్ మేట్ అయిన యువతితో కలిసి చదువుకొంటున్న యువకుడు, యువతిపై దాడి చేశారు. లవ్ జీహాద్ అంటూ యువతీ, యువకుడిపై దాడికి పాల్పడ్డారు. ఆ తరువాత వీరిద్దరినీ పోలీసులకి అప్పగించారు.

ఓ నర్సింగ్ కాలేజీ విద్యార్థిని తన ముస్లిం క్లాస్ మేట్‌తో క్లోజ్‌గా ఉందని వీహెచ్ పీకి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడి అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసుల వాహనంలో వెళ్తున్న యువతిపై… మహిళా కానిస్టేబుల్ దాడికి పాల్పడింది. ఇంతమంది హిందువులు ఉండగా…నీకు ముస్లిం వ్యక్తే దొరికాడా అంటూ తిడుతుండగా….వెనక సీట్లో యువతి పక్కన కూర్చొని ఉన్న పోలీస్ ఉమెన్ యువతిపై పలుమార్లు చేయి చేసుకొంది.

కారులో వీడియో తీసిన ఓ పోలీస్ మెన్ 29 సెకన్ల నిడివిగల ఈ వీడియో క్లిప్ ను తన ఫ్రెండ్ కి షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు…..ఈ ఘటనకు భాధ్యులైన నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. విచారణకు ఆదేశించామని, రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

Next Story