జంపన్న మావోయిస్టు పార్టీకి ద్రోహం చేశాడు..

జంపన్న మావోయిస్టు పార్టీకి ద్రోహం చేశాడు..
x
Highlights

ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు నేత జంపన్నపై ఆ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. మావోయిస్టు పార్టీకి జంపన్న ద్రోహం చేశాడని ఆరోపించింది. ఈ...

ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు నేత జంపన్నపై ఆ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. మావోయిస్టు పార్టీకి జంపన్న ద్రోహం చేశాడని ఆరోపించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ విడుదల చేశారు. జంపన్నను ఏడాది క్రితమే సస్పెండ్ చేశామన్న అభయ్ సస్పెండ్ తర్వాతే మావోయిస్టు పార్టీతో విభేదిస్తున్నట్లు చెప్పాడని వివరించారు. లొంగుబాటు గురించి జంసన్న అసలు తమతో చర్చించనేలేదన్నారు. సొంత లాభం , రాజకీయ స్వార్ధం కోసమే జంపన్న పార్టీని వీడాడని అభయ్ లేఖలో విమర్శించారు.

మావో విప్లవ ఉద్యమంపై జంపన్నకు నమ్మకం సడలిందని ఆ లేఖలో ఆరోపించారు. కమాండర్ జంపన్న శత్రువు ముందు లొంగిపోయినట్లు సెంట్రల్ కమిటీ ప్రతినిధి పేర్కొన్నారు. భయంతో స్వార్థపూరిత, నీచమైన మార్గాన్ని జంపన్న ఎంచుకున్నాడని, భారతీయ మావో విప్లవ పోరును జంపన్న మోసం చేశాడని ఆ లేఖలో ఆరోపించారు. విప్లవ ఉద్యమంలో మూడు దశాబ్ధాల పాటు జంపన్న పనిచేశాడని, కానీ లొంగుబాటుతో అతని కెరీర్ మరింత దిగజారిందన్నారు. జంపన్న పోలీసుల ముందు సరండర్ అయిన విధానాన్ని సెంట్రల్ కమిటీ ఖండిస్తున్నదని ప్రతినిధి అభయ్ తన లేఖలో తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ఫ్యాక్టరీలో టెక్నీషియన్‌గా చేసిన జంపన్న.. పీపుల్స్‌వార్ ఉద్యమంతో పాటు మావో సెంట్రల్ కమిటీలో ఎలా ఎదిగారన్న అంశాలను అభయ్ తన లేఖలో వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories