logo
సినిమా

హలో మూవీతో షాకిచ్చిన డైరెక్టర్ విక్రమ్ కుమార్.. విక్రమ్ కుమార్ ను దూరం పెట్టే యోచనలో ఎన్టీఆర్,బన్నీ

హలో మూవీతో షాకిచ్చిన డైరెక్టర్ విక్రమ్ కుమార్.. విక్రమ్ కుమార్ ను దూరం పెట్టే యోచనలో ఎన్టీఆర్,బన్నీ
X
Highlights

మనం, సూర్య 24 మూవీతో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు విక్రమ్ కుమార్. ఆ నమ్మకంతోనే నాగార్జున అఖిల్...

మనం, సూర్య 24 మూవీతో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు విక్రమ్ కుమార్. ఆ నమ్మకంతోనే నాగార్జున అఖిల్ రెండో మూవీని విక్రమ్ కుమార్ చేతిలో పెట్టాడు. కానీ హలో మూవీ ఫలితంతో అఖిల్ సీన్ మరోసారి రివర్సైంది. దీంతో హలో మూవీ కంటే ముందు విక్రమ్ కుమార్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, బన్నీ ఇప్పుడు దూరం పెడుతున్నారు. అతని పేరు చెబితేనే ఆమాడ దూరం పరిగెత్తుతున్నారు.

హలో మూవీతో దర్శకుడు విక్రమ్ కుమార్ పనితనం తేలిపోయింది. టాలెంటెడ్ డైరెక్టర్ అనే ఇమేజ్ కు గండిపడింది. హలో సినిమాను డిఫరెంట్ గా తీర్చిదిద్దుతాడనుకుంటే..సరకు లేకుండా వచ్చి బొక్కబోర్లా పడ్డాడు. ఇటు అఖిల్ కలలు ఆవిరి అయ్యాయి. భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించిన విక్రమ్ కుమార్ కనీసం అందులో సగం కూడా కలెక్ట్ చేయాలేకపోయాడు. అంతేకాదు వరుసగా సూర్య 24,అఖిల్ హలో సినిమాలు నిరాశపరచడంతో అప్పటి వరకు విక్రమ్ కుమార్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిన పెద్ద హీరోలు దూరం పెట్టారనే వార్తలు వస్తున్నాయి.

సూర్య 24 మూవీ పెద్దగా ఆడకపోయినా..టెక్నికల్ గా బాగుండడంతో..మంచి కథతో వస్తే విక్రమ్ కుమార్ తో సినిమాకు మొగ్గుచూపారు ఎన్టీఆర్, బన్నీ. హలో మూవీ ఫలితాన్ని చూశాకా నెక్ట్స్ మూవీని వర్కౌట్ చేయాలనుకున్నారు. కానీ హలో మూవీ ఇచ్చిన పంచ్ కు పెద్ద హీరోలంతా షాక్ తిన్నారు. విక్రమ్ తో సినిమా అంటేనే కంగారు పడుతున్నారు.

హలో మూవీతో విక్రమ్ కుమార్ దారి ఎటు అనే ప్రశ్న తలెత్తుతోంది. హలో మూవీ హిట్ ఐతే ఎన్టీఆర్, బన్నీ ఇద్దరిలో ఎవరో ఒకరు నెక్ట్స్ మూవీకి కమిట్ అయ్యేవాళ్లు. కానీ హలో సినిమా ఫ్లాప్ తో ఇద్దరూ సైడైపోయినట్టే అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెద్ద డైరెక్టర్ నుంచి బోలెడన్నీఆఫర్లు ఉండడంతో..పోయి పోయి విక్రమ్ కుమార్ తో సినిమాకు రిస్క్ చేయడం ఎందుకనే ఆలోచనలో ఎన్టీఆర్, బన్నీ ఉన్నట్టు తెలుస్తోంది. విక్రమ్ కుమార్ హలో మూవీ కంటే ముందు ఎన్టీఆర్, బన్నీ తో పాటు నాని కూడా సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. ఒకవేళ విక్రమ్ కుమార్ పై దయ తలచి మరో అవకాశం ఇస్తే నాని ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ నాని కూడా కనికరించకపోతే..పెద్ద హీరోలతో సినిమా విక్రమ్ కుమార్ కు రావడం గగనమనే చెప్పాలి.

Next Story