టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న శ్రీరెడ్డి వ్యవహారం...వర్మ ఎంట్రీతో డబుల్ అయిన రచ్చ

x
Highlights

శ్రీరెడ్డికి టాలీవుడ్‌కు మధ్య జరుగుతున్న పోరులో ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఎంటరయ్యారు. ఆర్జీవీ రాకతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా భూకంపం వచ్చినంత పనైంది. ఈ...

శ్రీరెడ్డికి టాలీవుడ్‌కు మధ్య జరుగుతున్న పోరులో ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఎంటరయ్యారు. ఆర్జీవీ రాకతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా భూకంపం వచ్చినంత పనైంది. ఈ ఇష్యూలో వర్మ ఎందుకు వేలు పెట్టారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది. శ్రీరెడ్డి నిరసనతో మొదలైన చర్చ ఇప్పుడు వర్మ జోక్యంతో పెద్ద రచ్చకే తెరలేపింది.

శ్రీరెడ్డి నిరసనతో ఇండస్ట్రీలో కొత్త గేమ్ మొదలైంది. ఆ గేమ్ ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ వ్యవహారంలో రోజురోజుకు కొత్త కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇస్తున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసనతో మొదలైన రచ్చ ఇండస్ట్రీలో పెద్ద దుమారానికే తెరలేపింది. ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి మధ్యలో కొందరు సినీ ప్రముఖుల ఇళ్ల దాకా వెళ్లింది. ఎప్పుడు ఎవరి విషయాలు బయటికొస్తాయో తెలియదు. ఏ ఆర్టిస్టు ఎవరి మీద ఆరోపణలు చేస్తారో తెలియదు ఇద్దరూ ఆధారాలున్నాయంటారు కానీ బయటపెట్టరు. ప్రొఫెషనల్ ఇష్యూ కాస్తా పర్సనల్ లైఫ్‌లోకి వెళ్లి పూటకొకరి పురాణాలు బయటకి వచ్చేస్తున్నాయి.

శ్రీ లీక్స్‌.. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మొదలైంది. నిర్మాత సురేష్‌బాబు కుమారుడు అభిరామ్‌తో కలిసి దిగిన ఫోటోలను శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే అక్కడితో మొదలైంది సినిమా. ఆ తర్వాత జీవిత రాజశేఖర్ ఫ్యామిలీలోకి ఇష్యూ టర్న్ తీసుకుంది. సంధ్య అనే నటి హీరో రాజశేఖర్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో జీవితే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి.. తమపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చింది.

ఓ పక్క ఈ విషయాలు నలుగుతుండగానే శ్రీరెడ్డి మరో బాంబ్ పేల్చింది. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇండస్ట్రీ షాక్ అయ్యింది. ఈ రచ్చలోకి ఎందుకు మెగా ఫ్యామిలీని లాగారనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. పవన్‌పై శ్రీరెడ్డి ఎందుకు ఆ రేంజ్‌లో విరుచుకుపడిందన్నది ఎవరికీ అర్థం కాలేదు. కల్యాణ్‌పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. తన తమ్ముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై శ్రీరెడ్డికి కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.

ఇవన్నీ ఒక ఎత్తైతే శ్రీరెడ్డి చేత పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయించింది రాంగోపాల్ వర్మేనని తేలడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది. ఈ వివాదంలో వర్మెందుకు వేలు పెట్టారు అసలు ఆయనకు ఏం అవసరం..? పవన్‌ను తిట్టిస్తే.. వర్మకేం వస్తుంది.? ఇలా ఎవరికి వాళ్లు ప్రశ్నలు సంధించుకుంటూ.. ఆన్సర్ వెతికే పనిలో పడ్డారు. ఇంతలో వర్మ ఇచ్చిన క్లారిటీలో.. ప్యూరిటీ మిస్సైంది. పవన్‌ను డీగ్రేడ్ చేయడానికి.. వర్మ వెనకాల ఎవరో కొందరు అజ్ఞాత వ్యక్తులు ఉండి నడిపిస్తున్నారనే వాదనలు ఉన్నాయి.

ఏదేమైనా శ్రీరెడ్డి వ్యవహారంలో.. ఇండస్ట్రీలో చిచ్చురేపిందనే చెప్పాలి. ఈ చిచ్చులో వర్మ వేలెట్టడంతో.. దాని సెగ ఇండస్ట్రీ అంచుల దాకా పాకింది. సో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఎప్పుడేం జరుగుతుంది.? ఎవరి విషయాలు.. ఎవరు బయటపెడతారన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories