logo
జాతీయం

దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలి: అమిత్ షా

దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలి: అమిత్ షా
X
Highlights

రఫెల్ డీల్ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ స్వాగతించింది. సుప్రీం తీర్పుతో సేవకుడు ఎవరో దొంగలు ఎవరో...

రఫెల్ డీల్ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ స్వాగతించింది. సుప్రీం తీర్పుతో సేవకుడు ఎవరో దొంగలు ఎవరో దేశ ప్రజలకు తెలిసిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలిసిందన్నారు. అవాస్తవాలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలకు సుప్రీం తీర్పు చెంప పెట్టులాందన్నారు. ఈ వ్యవహారంలో దేశ ప్రజలు, సైన్యానికి రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో అవినీతి ఎలా జరుగుతుందంటూ ఆయన ప్రశ్నించారు. దేశ రక్షణలో అత్యంత కీలకమైన వాయుసేనకు బలోపేతం చేసేందుకే ఈ ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. రఫెల్ డీల్‌పై నిత్యం ఆరోపణలు చేస్తున్న రాహుల్‌్కు ఎవరి నుంచి సమాచారం వస్తుందో చెప్పాలంటూ ప్రశ్నించారు. 2007 నుంచి 2014 వరకు రఫెల్ డీల్‌ను ఎందుకు ఆమోదించాలేదో దేశ ప్రజలకు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

Next Story