నిత్యానంద దేశం నుంచి పారిపోయినట్లేనా?

నిత్యానంద దేశం నుంచి పారిపోయినట్లేనా?
x
Highlights

తనను తాను దేవుడుగా చెప్పుకునే స్వామి నిత్యానంద దేశం విడిచిపోయాడనే పుకార్లు షికారు చేస్తున్నాయి. చట్టం నుంచి తప్పించుకునేందుకు ఆయన విదేశాలకు...

తనను తాను దేవుడుగా చెప్పుకునే స్వామి నిత్యానంద దేశం విడిచిపోయాడనే పుకార్లు షికారు చేస్తున్నాయి. చట్టం నుంచి తప్పించుకునేందుకు ఆయన విదేశాలకు పారిపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కేమన్ దీవుల్లో నిత్యానందకు ఆశ్రయం దక్కిందని కొందరు చెబుతున్నారు. కొంతకాలం నుంచి నిత్యానంద ఆశ్రమంలో లేకపోవడంతో ఈ రకమైన పుకార్లు పుట్టుకొచ్చాయి.

నెల రోజులుగా నిత్యానందను చూడలేదని అక్కడి స్థానికులు చెబుతుండగా ఆయన శిష్యులు మాత్రం ఉత్తర భారతంలో పర్యటిస్తున్నారంటున్నారు. ఉత్తర భారత పర్యటనలో ఉన్న ఆయన త్వరలోనే మళ్లీ తిరిగివస్తారని చెబుతున్నారు. అయితే, నిత్యానందను వ్యతిరేకించే వారు మాత్రం లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తరహాలోనే ఆయన కూడా విదేశాలకు పారిపోయారని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులేమో నిత్యానంద పాస్‌పోర్టు ఇటీవలే రద్దయిందని, ఆయన విదేశాలకు వెళ్ళే అవకాశం లేదని చెబుతున్నారు.

2010లో ఓ నటితో శృంగారం చేస్తున్నట్టుగా వీడియో ద్వారా వార్తల్లో నిలిచిన నిత్యానంద అప్పటి నుంచి వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. 40 ఏళ్ల నిత్యానంద అసలు పేరు రాజశేఖరన్. బెంగళూరు - మైసూరు హైవేపై ఉన్న బిదాది దగ్గర 20 ఏళ్ల క్రితం నిత్యానంద ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఓషో రజనీష్ ఫిలాసఫీ ఆధారంగా ఆయన ప్రవచనాలు ఉండేవి. అవే ఆయనకు ఎక్కువ సంఖ్యలో శిష్యులు పుట్టుకొచ్చేలా చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories