logo
జాతీయం

వాట్సాప్‌ సీఈవోగా భారత్‌కు చెందిన నీరజ్‌ అరోరా?

వాట్సాప్‌ సీఈవోగా భారత్‌కు చెందిన నీరజ్‌ అరోరా?
X
Highlights

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పలు బహుళ జాతి సంస్థలకు భారతీయులు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆ...

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పలు బహుళ జాతి సంస్థలకు భారతీయులు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో పేరు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ చాట్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ సీఈవోగా భారత్‌కు చెందిన నీరజ్‌ అరోరాను నియమించే ఆవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆ సంస్థ సీఈవో పదవి నుంచి జాన్‌ కౌమ్‌ వైదొలగడంతో.. వాట్సాప్‌ కొత్త సీఈవో వేటలో పడింది. 2014లో వాట్సాప్‌ను కొనుగోలు చేసిన ఫేస్‌బుక్‌ ప్రస్తుతం డేటా లీకేజీ వ్యవహరంతో ఇబ్బంది పడుతోంది. అయితే ఫేస్‌బుక్‌తో కలిసి పనిచేయడం ఇష్టం లేకనే జాన్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూజర్ల డేటా భద్రత అనేది ప్రధాన సమస్యగా మారిన ఈ తరుణంలో కొత్త సీఈవో ఎంపిక విషయంలో చాలా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story