అందం మీద ఆరాటం, పిల్లల భవిష్యత్తుపై ఆందోళన

మానసిక ఒత్తిడే శ్రీదేవి కొంపముంచిందా ? నిత్యం యోగా చేసే అతిలోకసుందరికి గతంలో ఎన్నడూ హార్ట్ అటాక్ రాలేదు....
మానసిక ఒత్తిడే శ్రీదేవి కొంపముంచిందా ? నిత్యం యోగా చేసే అతిలోకసుందరికి గతంలో ఎన్నడూ హార్ట్ అటాక్ రాలేదు. అందం మీద అతి జాగ్రత్త, పిల్లల కెరీర్‌పై టెన్షన్ ఏదీ బయటకు రానివ్వరు. వీటన్నంటితోనే శ్రీదేవి కన్నుమూశారా ? కూతురు జాన్వీ సినిమా కెరీర్ ఎలా ఉంటుందోనన్న టెన్షన్ పడిందా ? ఈ స్ట్రెస్‌తోనే శ్రీదేవి కన్నుమూసిందా ?
శ్రీదేవికి యాభై నాలుగేళ్లు. ప్రస్తుత జీవన ప్రమాణాల ప్రకారం ఈ వయసేం పెద్దది కాదు. ఆమె నిత్యం యోగా చేస్తూ చురుగ్గా కనిపిస్తుంటుంది. గుండె జబ్బున్నట్లు గత వైద్య పరీక్షల్లో ఎన్నడూ తేలలేదు. అయితే హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. అందర్నీ హతాశుల్ని చేస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. శ్రీదేవి మరణానికి కారణాలేంటదన్నది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎవరు చూసిని శ్రీదేవి మరణం గురించే చర్చించుకుంటున్నారు.
శ్రీదేవి...తన భావోద్వేగాలను బయటపెట్టకుండా, క్లిష్ట పరిస్థితుల్లోనైనా నిబ్బరంగా ఉండటం శ్రీదేవికి చిన్నప్పటి నుంచి అలవాటు. నాలుగైదు రాష్ట్రాలు, ఎన్నో భాషలు, అన్నేసి సంస్కృతులు, ఇంకెన్నో రకాల పరిస్థితులు, మరెన్నో వ్యక్తిత్వాలు ఆమెకు సుపరిచితమే. ఆ అలవాటే ఆమెను మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఉంటుందని భావిస్తున్నారు. అందం మీద ఆరాటం, పిల్లల భవిష్యత్తుపై ఆందోళన, ఏ విషయాన్నీ బయటకు పొక్కనివ్వని మనస్తత్వం ఇవన్నీ శ్రీదేవి జీవితానికి శాపంగా మారాయని మానసిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 15 శాతం కార్డియాక్ అరెస్టులకు మానసిక ఒత్తిడి, కుంగుబాటులే కారణమని వైద్యులు చెబుతున్నారు.
సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. మనిషి ముక్కు సూటిగా ఉండకూడదు. ముక్కు మాత్రం అందంగా ఉండాలి. మనసులో మాట పెదాలు దాటకూడదు. నవ్వు మాత్రం పెదాల మీద మరింత అందంగా తళుకులీనాలి. ఇండస్ట్రీ నేర్పిన పాఠాలతోనే ఆమె ముక్కును ఆపరేషన్ ద్వారా తీర్చిదిద్దుకొంది. బాలీవుడ్‌లో హిమ్మత్‌వాలాతో శ్రీదేవి పెద్ద హిట్ అందుకుంది. తర్వాత ఎన్నో సినిమాలు హిట్ కావడం అంతలోనే మిథున్ చక్రవర్తితో పెళ్లి వ్యవహారం తూచ్ అనడం అప్పటికే పెళ్లయిన బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత కూడా శ్రీదేవి ఆహార్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఎప్పుడూ మంచి ఛాయతో కనిపించాలని ఆరాటపడింది.
శ్రీదేవి సర్జరీలు చేయించుకుని బరువు తగ్గలేదు. తన కుమార్తె తొలి చిత్రం ఎలా ఉండబోతుందోననే స్ట్రెస్ ఆమెలో ఎక్కువగా ఉంది. జాన్వి ఎలా చేస్తుందో ఎలా చేయగలుగుతుందో అనే టెన్షన్ శ్రీదేవిలో ఉండేదని బాలీవుడ్‌లోని శ్రీదేవి సన్నిహితులు అంటున్నారు. బాహుబలి చిత్రంలో శివగామిగా నటించే అవకాశం తొలుత శ్రీదేవికే వచ్చినా దాన్ని చేజేతులా జారవిడుచుకుంది. బాహుబలి సూపర్ హిట్ కావడంతో ఆమెను మానసికంగా కాస్త ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో దానికితోడు ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె తమిళంలో నటించిన పులి బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఈ ఒత్తిళ్లతోనే శ్రీదేవికి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
పాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTతిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMTహైదరాబాద్ ఓల్డ్‌సిటీలో రియల్ దంగల్.. రెజ్లింగ్‌లో రాణిస్తున్న 14 ఏళ్ల...
27 May 2022 5:08 AM GMTరేవంత్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లో రచ్చ.. వివరణ ఇవ్వాలని మధుయాష్కీ...
27 May 2022 4:15 AM GMT