Top
logo

హీరోయిన్ సమంత చేతికి ఏమైంది? ఎందుకు కట్టు కట్టుకుంది?

హీరోయిన్ సమంత చేతికి ఏమైంది? ఎందుకు కట్టు కట్టుకుంది?
X
Highlights

'రంగస్థలం' చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా సమంత నటిస్తోంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే,...

'రంగస్థలం' చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా సమంత నటిస్తోంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, చేతికి కట్టు కట్టుకుని ఉన్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె చేతికి ఏమైందో అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే...కొన్ని కీలకమైన సీన్స్‌తో పాటు రామ్‌చరణ్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను రీసెంట్‌గా కంప్లీట్‌ అయిన రాజమండ్రి షెడ్యూల్‌లో చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌లో పాల్గొన్న సమంతకు ఓ రోజు హెవీ వర్క్‌ వల్ల కాస్త చెయ్యి నొప్పి అనిపించిందట. అందుకనే ఆమె కట్టు కట్టించుకున్నారు. ఇన్‌సెట్‌లో ఉన్న ఫొటో చూశారుగా.. అందులో ఉన్నది సమంత హ్యాండే. ‘‘ఫుల్‌గా హార్డ్‌ వర్క్‌ చేస్తున్నాం. అందుకు నా చెయ్యే నిదర్శనం’’ అని సమంత పేర్కొన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మార్చి 30న విడుదల చేయాలని భావిస్తున్నారు.

Next Story