వెబ్‌సిరీస్‌గా సిల్క్‌స్మిత లైఫ్.. తెలియనివెన్నో చూపిస్తారట

వెబ్‌సిరీస్‌గా సిల్క్‌స్మిత లైఫ్.. తెలియనివెన్నో చూపిస్తారట
x
Highlights

శృంగార తార సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ద డర్టీ పిక్చర్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అంతేకాదు అందులో...

శృంగార తార సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ద డర్టీ పిక్చర్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అంతేకాదు అందులో సిల్క్ స్మితగా నటించిన విద్యాబాలన్‌కు సైతం జాతీయ అవార్డును తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాను పక్కనపెడితే, ఇప్పుడు ఆమె జీవితం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈసారి వెబ్ సిరీస్‌గా రానుంది. సిల్క్‌స్మిత జీవితంలో చాలా మందికి తెలియని విషయాలను ఇందులో చూపించనున్నట్టు సమాచారం. అయితే ఇది వెబ్‌ సీరీస్‌గా రూపొందనుండటం విశేషం. మరో విశేషం ఏమిటంటే కబాలి, కాలా వంటి సంచలన చిత్రాల దర్శకుడు పా.రంజిత్‌ దృష్టి సిల్క్‌స్మిత బయోపిక్‌పై పడింది. ఆయన తన చిత్ర నిర్మాణ సంస్థలో సిల్క్‌ జీవిత చరిత్రను వెబ్‌ సిరీస్‌గా నిర్మించనున్నారు. ఇందులో సిల్క్‌స్మిత ఆరంభ కాలం నుంచి అంతం వరకూ తెరకెక్కించనున్నారు. దీనికి సంబధించిన పూర్తి వివరాలు వెల్లడించకపోయినా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయట. ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories