డ్యాంలోని నీటి లాగేస్తున్న రాకాసి మేఘం

x
Highlights

నైరుతి రుతుపవనాల వేగంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చండప్రచడంగా వీస్తున్న గాలులలో కొన్ని ప్రాంతాల్లో సుడిగాలులు...

నైరుతి రుతుపవనాల వేగంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చండప్రచడంగా వీస్తున్న గాలులలో కొన్ని ప్రాంతాల్లో సుడిగాలులు ఏర్పడుతున్నాయి. అలా ఏర్పడిన ఓ సుడిగుండం డ్యాం లోని నీటిని లాగేసి మేఘంలోకి పంపుతోంది ఇప్పుడీ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. గాలి ప్రభావానికి డ్యాం లోని నీరంతా ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. ఆకాశానికి భూమికి మధ్య ఏదో నిచ్చెన వేసినట్టుగా మేఘం డ్యాంలోని నీటిని స్వాహా చేస్తున్న ఆ దృశ్యాలను కొంత మంది ఔత్సాహికులు సెల్ ఫోన్ లో బందించారు. డ్యాంలో ఉన్న నీరంతా ఖాళీ అయిపోతుందా అన్నంతగా మేఘం నీటిని లాగేస్తున్న దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ దృశ్యాలు మహారాష్ట్రలోని నజారే డ్యాం దగ్గర చిత్రీకరించారు. రాకాసి మేఘం నజారే డ్యాం లోని నీటిని అమాంతంగా మింగేస్తున్నట్టుగా కనిపిస్తున్న ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు కూడా ఈ మేఘాలే కారణంగా భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories