వరంగల్ చూసేందుకు వెళ్తున్నారా.. వాటర్ పట్టుకెళ్లండి!

వరంగల్ చూసేందుకు వెళ్తున్నారా.. వాటర్ పట్టుకెళ్లండి!
x
Highlights

వరంగల్ అనగానే.. చారిత్రక వేయిస్తంభాల గుడి.. భద్రకాళీ దేవస్థానం.. మ్యూజికల్ గార్డెన్.. వరంగల్ కోట.. రామప్ప.. లక్నవరం.. పాకాల.. ఇలా దర్శనీయ ప్రదేశాలన్నీ...

వరంగల్ అనగానే.. చారిత్రక వేయిస్తంభాల గుడి.. భద్రకాళీ దేవస్థానం.. మ్యూజికల్ గార్డెన్.. వరంగల్ కోట.. రామప్ప.. లక్నవరం.. పాకాల.. ఇలా దర్శనీయ ప్రదేశాలన్నీ మన కళ్లముందు కదలాడుతుంటాయి. ప్రకృతి అందాలకు నెలవైన ఈ ప్రాంతాలను చూసేందుకు చాలా మంది ఆరాటపడుతుంటారు. ఇప్పుడు వేసవి సెలవులు కూడా కలిసి రావడంతో.. వందలాది మంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అందాలను చూసేందుకు వెళ్తున్నారు.

అలాంటి వారికి.. మంచి నీళ్ల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడ చూసినా.. ఏ ప్రముఖ ప్రాంతానికి వెళ్లినా.. నీళ్లు లేకపోవడం సమస్యగా మారింది. పర్యాటకులంతా.. మంచి నీళ్లను డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాక.. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు కూడా ఈ పర్యాటక ప్రాంతాలు సందర్శించేందుకు వస్తున్నారు. కానీ.. నీటి వసతి లేక.. తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ప్రభుత్వం స్పందించకుంటే.. స్వచ్ఛంద సంస్థలైనా ఈ విషయంలో స్పందించాలని.. చలివేంద్రం ఏర్పాటు చేసేవాళ్లు.. పర్యాటక ప్రాంతాల్లో నీటి వసతి కల్పించేందుకు ముందుకు రావాలని పర్యాటకులు కోరుతున్నారు. లేదంటే.. ఈ వార్త తెలుసుకున్న పర్యాటకులైనా.. కాస్త ఎక్కువగానే మంచినీళ్లను వెంట పెట్టుకుని తిరగాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories