కూటమిలో పొత్తుల పోరు..

కూటమిలో పొత్తుల పోరు..
x
Highlights

ముందస్తు ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ ను ధీటుగా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ తో టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ జత కట్టాయి. మహాకూటమిగా అవతారించాయి. పొత్తు...

ముందస్తు ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ ను ధీటుగా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ తో టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ జత కట్టాయి. మహాకూటమిగా అవతారించాయి. పొత్తు విషయంలో టీడీపీ సర్దుకుపోయే దోరణిలో ఉన్నా సిపిపి, టీజేఎస్ అనేక వివాదాలకు దారితీశాయి. మొదట కూటమకి చైర్మెన్ పదవి పై పట్టుపెట్టిన టిజేఎస్ దాన్ని సాధించుకుంది. సీట్ల సర్దుబాటు విషయంలో ముప్పుతిప్పలు పెడుతోంది. టీజేఎస్ తరహాలోనే సీపీఐ పేచి పెట్టింది. చివరకు పెద్దన్న పాత్రలోకాంగ్రెస్ 8 స్థానాలు టిజేఎస్ కు, సిసిఐకి 3 స్థానాలు కేటాయిస్తే మొదటి పేచి పెట్టిన ఆ రెండు పార్టీలు చివరకు అంగీకరించాయి.

తనకు కేటాయించిన మూడు సీట్లకు సీపీఐ అభ్యర్థులు ప్రకటించింది. టీజేఎస్ మాత్రం కూటమి పక్షాలు ప్రకటించిన స్థానాలను మాకు కావాలంటూ అభ్యర్థులను ప్రకటించి గందరగోళం సృష్టించింది. పొత్తులో భాగంగా మహబూబ్ నగర్ సీటు కాంగ్రెస్ కు దక్కింది. అభ్యర్థిగా ఎర్ర శేఖర్ పేరును ప్రకటించారు. మహబూబ్ నగర్ సీటు తమదే అంటూ టీజేఎస్ తమ అభ్యర్థిగా రాజేంద్ర రెడ్డిని పేరును ప్రకటించింది. ఆసిపాబాద్, ఆత్రం సక్కు, స్టేషన్ ఘన్ పూర్ స్థానాల్లో కూడా కాంగ్రెస్ తో టీజేఎస్ పోటీ పడుతోంది. టీజేఎస్ తీరుతో కాంగ్రెస్ తీవ్ర ఆందోళన చెందుతోంది.
టిజేఎస్‌తో నాలుగు స్థానాల్లో స్నేహపూర్వక పోటీ చేయాలనే నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ నాలుగు స్థానాల్లో టీజేఎస్ పోటీ చేయకుండా ఉండేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టిజేఎస్ ప్రకటన పై ఇప్పటి వరకు భాగస్వామ్య పక్షాల పార్టీలు స్పందించలేదు. కానీ కోదండరాం తీరు పై మండిపడుతున్నారు. ఇలాంటి ట్విస్టులు పెట్టడం వెనుక కోదండ రాజకీయ వ్యూహం ఏమిటన్న దానిపై కాంగ్రెస్ తీవ్రంగా ఆలోచిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories