'వినయ విధేయ రామ' ట్రైలర్ రేపే

వినయ విధేయ రామ ట్రైలర్ రేపే
x
Highlights

రంగస్థలం సినిమాతో టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టిన రామ్ చరణ్ ఇప్పుడు 'వినయ విధేయ రామ' అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. బోయపాటి శ్రీను...

రంగస్థలం సినిమాతో టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టిన రామ్ చరణ్ ఇప్పుడు 'వినయ విధేయ రామ' అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా సంక్రాంతికి మన ముందుకు రాబోతుంది. కొన్ని వారాలు ముందే విడుదలైన ఈ సినిమా టీజర్ ఈ సినిమా లో బోయపాటి మార్క్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి అని హింట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కు ఒక శుభ వార్త. ఇక ఎదురుచూడాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే ఈ చిత్ర ట్రైలర్ ను రేపు అనగా డిసెంబర్ 27 వ తారీఖు న గ్రాండ్ గా విడుదల చేస్తామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ సినిమా ఆడియో జ్యూక్ బాక్స్ కూడా రేపే విడుదల చేయనున్నారు. 'భరత్ అనే నేను' సినిమా తో పరిచయమైన కీయారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, వివేక్ ఒబెరోయి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories