ఆఇద్దరు ఏమైపోయారో : భయందోళనలో విశాల్

Highlights

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో హైడ్రామా కొనసాగుతూనే ఉంది. విశాల్ నామినేషన్ అంశంపై జరుగుతున్న తాజా పరిణామాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. తన నామినేషన్ వ్యవహారం ఇంకా...

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో హైడ్రామా కొనసాగుతూనే ఉంది. విశాల్ నామినేషన్ అంశంపై జరుగుతున్న తాజా పరిణామాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. తన నామినేషన్ వ్యవహారం ఇంకా మలుపులు తిరుగుతున్నట్టు విశాల్ ట్వీట్టర్ ద్వారా వివరించారు. విశాల్ నామినేషన్ను ఈసీ పున: సమీక్షించబోతుందనే సంకేతాలు అందుతున్నాయి.

నిజానికి విశాల్ నామినేషన్ను ప్రతిపాదించిన దీపన్ , సుమతి సంతాకాలు ఫోర్జరీవని ఆరోపణలు రావడంతోనే ఆయన బరి నుంచి తప్పుకోవలసి వచ్చింది. తన నామినేషన్‌ను తిరస్కరించడంపై విశాల్ తమిళనాడు ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజేశ్ లక్హోనిని కలిశారు. నామినేషన్‌ను తిరస్కరించడం తర్వాత ఆమోదించడం మళ్లీ తిరస్కరించడం ఆ తర్వాత జరిగిన హైడ్రామా గురించి వివరిస్తూ ఈసీ ప్రధానాధికారికి నివేదిక సమర్పించారు. తిరస్కరించిన నామినేషన్‌ను తిరిగి ఆమోదిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి చెప్పిన వీడియోను కూడా ఆయన ఈసీ చీఫ్‌కు చూపించారు.
దీంతో దీపన్, సుమతిని తమ ముందు హాజరుపరచాల్సిందిగా ఈసీ ఆదేశించినట్లు తెలుస్తోంది.

దీపన్, సుమతిని తమ ప్రవేశపెట్టాలని ఈసీ ఆదేశించినట్లు మీడియా ద్వారా సమాచారం అందిందంటూ విశాల్ ట్వీట్ చేశాడు. 3 గంటల వరకు సమయం ఇచ్చారని తెలిపాడు. కానీ దీపన్ , సుమతి ఆచూకీ ప్రస్తుతం లభించడంలేదన్న విశాల్ కేవలం రెండు గంటలు సమయం మాత్రమే ఇవ్వడంపై విమర్శలు గుప్పించాడు. మరోవైపు దీపన్ , సుమతికి ప్రాణహాని ఉందని విశాల్ ఆందోళన వ్యక్తం చేశాడు. దీపన్, సుమతి ఆచూకీ కోసం పోలీసుల్ని ఆశ్రయిస్తానని విశాల్ అంటున్నాడు.

అయితే విశాల్ తనను బెదిరించడం వల్లే ఆయన నామినేషన్ను బలవంతంగా ఆమోదించానని రిటర్నింగ్ అధికారి చెప్పడం మరో ట్విస్ట్. బలప్రయోగం ద్వారా నామినేషన్ ఆమోదింప చేసుకున్నారని రిటర్నింగ్ అధికారి చెప్పడం కొసమెరుపు. చివరికి విశాల్ నామినేషన్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుంది..? దీపన్, సుమతి ప్రస్తుతం ఎక్కడున్నారు...? వారే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా..? లేదంటే ఎవరైనా వారిని మాయం చేశారా అనేది తేలాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories