Top
logo

శ్రీలంకతో వన్డే సిరీస్ కు విరాట్ కొహ్లీ దూరం

Highlights

సౌతాఫ్రికా టూర్ కు ముందు విశ్రాంతి కావాలంటూ మొరపెడుతున్న విరాట్ కొహ్లీని ఎట్టకేలకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ...

సౌతాఫ్రికా టూర్ కు ముందు విశ్రాంతి కావాలంటూ మొరపెడుతున్న విరాట్ కొహ్లీని ఎట్టకేలకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కరుణించింది. శ్రీలంకతో జరిగే తీన్మార్ వన్డే సిరీస్ లో కొహ్లీకి విశ్రాంతి ఇచ్చి రోహిత్ శర్మ కు పగ్గాలు అప్పజెప్పింది. న్యూఢిల్లీలో డిసెంబర్ 2 నుంచి జరిగే ఆఖరిటెస్ట్ తర్వాత నుంచి విరాట్ కొహ్లీ విశ్రాంతిలో ఉంటాడు. ఇక రోహిత్ శర్మ నాయకత్వంలోని వన్డే జట్టులో శిఖర్ ధావన్, అజింక్యా రహానే, శ్రేయేస్అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ధోనీ, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్,కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, సిద్ధార్ధ్ కౌల్ లకు చోటు కల్పించారు.

Next Story