Top
logo

కోహ్లీని అధిగమించిన పుజారా..

Highlights

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పూజారా రెండోస్థానంలో నిలిచాడు. నాగపూర్ విదర్భ...

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పూజారా రెండోస్థానంలో నిలిచాడు. నాగపూర్ విదర్భ స్టేడియం వేదికగా శ్రీలంకతో ముగిసిన రెండోటెస్ట్ తొలిఇన్నింగ్స్ లో 143 పరుగుల స్కోరు సాధించడం ద్వారా విలువైన 22 పాయింట్లు సంపాదించాడు. దీంతో 888 పాయింట్లతో పూజారా టాప్ ర్యాంకర్ స్టీవ్ స్మిత్ తర్వాతి స్థానంలో నిలువగలిగాడు. స్మిత్ మొత్తం 941 ర్యాంకింగ్ పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్ గా నిలిచాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ నాగపూర్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించడం ద్వారా ఏకంగా 60 పాయింట్లు సాధించి మొత్తం 877 పాయింట్లతో ఐదో ర్యాంక్ ను మరింత పటిష్టం చేసుకొన్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 849 పాయింట్లతో నాలుగోస్థానం సంపాదించాడు. ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ యాండర్సన్ బౌలర్ ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Next Story