Top
logo

కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి

కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి
X
Highlights

భూ కబ్జాలు, బెదిరింపులకు పాల్పడే చరిత్ర కొండా దంపతులదని ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత వారికి లేదని తాజా...

భూ కబ్జాలు, బెదిరింపులకు పాల్పడే చరిత్ర కొండా దంపతులదని ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత వారికి లేదని తాజా మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఏకగ్రీవంగా గెలవాలని సవాల్‌ విసిరారు. అలా గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ సర్వేలో కొండాకు మెజార్టీ రాలేదని వినయ్‌ భాస్కర్‌ చెప్పుకొచ్చారు. కొండా దంపతులకు టీఆర్‌ఎస్ రాజకీయంగా పునర్జన్మనిచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో కేటీఆర్‌పై ఎన్నో కేసులు పెట్టారు. కేటీఆర్‌పై కొండా దంపతులు విమర్శలు చేయడం సరికాదన్నారు. కొండా కుటుంబానికి టీఆర్‌ఎస్ తరపున టికెట్ ఇవ్వకపోవడంతో వరంగల్ ఈస్ట్‌లో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారని వినయ్ భాస్కర్ తెలిపారు.

Next Story