బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పిన 'అర్జున్ రెడ్డి' స్టార్

బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పిన అర్జున్ రెడ్డి స్టార్
x
Highlights

'అర్జున్ రెడ్డి' సినిమా తో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమా తో స్టార్ గా మారిపోయాడు. ఈ మధ్యనే విడుదలైన...

'అర్జున్ రెడ్డి' సినిమా తో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమా తో స్టార్ గా మారిపోయాడు. ఈ మధ్యనే విడుదలైన 'టాక్సీ వాలా' సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. మామూలుగానే పరభాషా హీరోలకి బాలీవుడ్ లో సినిమాలు చేసే అవకాశాలు తక్కువగా వస్తాయి. ఒకవేళ నిజంగా వస్తే బాలీవుడ్ లో నటించే అవకాశం వస్తే ఏ హీరో కూడా వదులుకోవాలని అనుకోడు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం బాలీవుడ్లో నటించే అవకాశాన్ని వదులుకున్నాడట. బాలీవుడ్ లో దర్శకుడు కబీర్ ఖాన్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

1983లో భారత్ విజయం సాధించిన క్రికెట్ వరల్డ్ కప్ ప్రధానాంశంగా సాగే ఈ సినిమాలో రన్వీర్ సింగ్, కపిల్ దేవ్ పాత్రను పోషిస్తున్నాడు. కపిల్ దేవ్ మరియు క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మంచి స్నేహితులని సంగతి తెలిసిందే. అయితే కబీర్ ఖాన్ విజయ్ దేవరకొండ ను శ్రీకాంత్ పాత్ర పోషించమని కోరాడట. కానీ ఇప్పటికే టాలీవుడ్ లో చాలా కమిట్మెంట్ లు ఉండటంతో, అలాగే తనది ముఖ్య పాత్ర తప్ప ప్రధాన పాత్ర కాకపోవడంతో విజయ్ దేవరకొండ సున్నితంగా కబీర్ ఖాన్ కు నో చెప్పాడని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories