పాపం.. బతికుండగానే చంపేశారు

సెలెబ్రిటీలు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారంటే చాలు. వారి చివరి ఘడియల కోసం ఎదురుచూసేవాళ్ల సంఖ్య ఈ మధ్య మరీ...
సెలెబ్రిటీలు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారంటే చాలు. వారి చివరి ఘడియల కోసం ఎదురుచూసేవాళ్ల సంఖ్య ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఆ మధ్య సత్యనారాయణ అన్న నటుడు చనిపోయారని తెలియగానే.. కొన్ని చానళ్లలో కైకాల సత్యనారాయణ ఇక లేరు.. అంటూ వార్తలొచ్చేశాయి. అంతకుముందు.. ఇలానే చాలామంది సెలెబ్రిటీల విషయంలో ఇలాగే జరిగింది. తర్వాత.. నేను బానే ఉన్నా.. అంటూ సదరు సెలెబ్రిటీలే స్వయంగా వివరించాల్సి వచ్చింది.
ఇప్పుడు అలాంటి జాబితాలో కన్నడ నటి.. తెలుగు వారికీ సుపరిచితురాలైన జయంతి కూడా చేరిపోయారు. ఆమె అనారోగ్యంతో ఉన్నారన్న మాట నిజమే. కానీ.. ఇప్పటికిప్పుడు ఆమెకు వచ్చిన ముప్పేమీ లేదు. అయినా కూడా.. ఏదో వదంతులను నమ్ముతూ.. జయంతి ఇక లేరు.. అంటూ కొన్ని చానళ్లు ఆమెను బతికుండగానే చంపేశాయి. పాపం.. హాస్పిటల్ లో ఉన్నారు కాబట్టి.. జయంతికి ఇంకా ఈ విషయం తెలియలేదు కానీ.. బయట ఉండి ఉంటే చాలా ఆవేదనకు గురయ్యేవారు.
ఈ విషయంపై.. జయంతి కుమారుడు కృష్ణకుమార్ స్పందించారు. ఆస్తమాతో తన తల్లి బాధపడుతున్నారని.. బెంగళూరులోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. నిన్నటి కంటే కూడా.. ఇవాళ చికిత్సకు బాగా స్పందిస్తున్నారని.. త్వరలోనే కోలుకుంటారన్న నమ్మకం కూడా ఉందని చెప్పారు. వదంతులు వ్యాపింపచేయవద్దని కోరారు.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT