logo
సినిమా

మ‌ళ్లీ నవ్వించ‌డానికి రెడీ అవుతున్న వేణుమాధ‌వ్

మ‌ళ్లీ నవ్వించ‌డానికి రెడీ అవుతున్న వేణుమాధ‌వ్
X
Highlights

గత కొన్ని సంవత్సారాలుగా వెండితెరకు దూరమైన కమెడియన్ వేణుమాధవ్ మళ్లీ నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం...

గత కొన్ని సంవత్సారాలుగా వెండితెరకు దూరమైన కమెడియన్ వేణుమాధవ్ మళ్లీ నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం తాను హెల్థీగానే ఉన్నానని.. తనకెలాంటి మనీ ప్రాబ్లెమ్స్ లేవని.. ఐ కమింగ్ బ్యాక్ అంటున్నాడు. తన గురించి సోషల్ మీడియాలో వచ్చిన వన్నీ రూమర్సేనని ఇకపై రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ మిమ్మల్ని అలరిస్తానంటున్నాడు వేణుమాధవ్.

వేణుమాధవ్ టాలీవుడ్ లోని స్టార్ కమెడియన్‌లలో ఒకరు. తన కామెడీతో ఇటు ప్రేక్షకుల అభిమానం.. డబ్బు సంపాదించుకున్నాడు. సడన్ గా ఏమైందో ఏమో కాని సినిమాల్లో నటించడం మానేసాడు. తన సినిమాలు రాక ఒకటా రెండా నాలుగైదు సంవత్సరాలే అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో వేణుమాధవ్ గురించి రకరకాల న్యూస్ వైరల్ అయ్యాయి.

టాలీవుడ్ లో 1997లో మొదలైన వేణుమాధవ్ వెండితెర నవ్వుల ప్రస్థానం 2015 వరకు అప్రతిహతంగా కొనసాగింది. ఆ తర్వాత సడన్గా సినిమాల్లో కనిపించడం మానేసాడు. అంతే కాదు ఆతర్వాత కనీసం మీడియాలో కూడా కనిపించలేదు. దాంతో వేణుమాధవ్ హెల్థ్ బాలేదని ఒకసారి, చనిపోయారని మరోసారి ఆస్థులు పోయాయని ఫైనాన్స్ ప్రాబ్లెమ్స్ లో ఉన్నాడని ఇలా రకరకాలుగా పుకార్లు షికారు చేసారు.

అయితే సోషల్ మీడియాలో తన గురించి వచ్చిన న్యూస్ అంతా రూమర్స్ అని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. తనకేం కాలేదని ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని అలాగే ఆర్థికపమైన ఇబ్బందులు కూడా లేవని అభిమానుల నుద్దేశించి రీసెంట్ ఇంటర్వ్యూలలో వేణుమాధవ్ చెప్పారు. ప్రజెంట్ తాను 4 సినిమాల్లో నటించానని అవన్నీ రెడీ ఫర్ రిలీజ్ అని త్వరలో మళ్లీ ప్రేక్షకులకు మళ్లీ నవ్వుల విందు చేస్తానని వేణుమాధవ్ అన్నారు.

Next Story