logo
సినిమా

స్పీడ్ పెంచిన వరుణ్ తేజ్..తొలిప్రేమ తర్వాత స్పేస్ థ్రిల్లర్ మూవీకి రెడీ

స్పీడ్ పెంచిన వరుణ్ తేజ్..తొలిప్రేమ తర్వాత స్పేస్ థ్రిల్లర్ మూవీకి రెడీ
X
Highlights

యంగ్ హీరో వరుణ్ తేజ్ మంచి స్పీడ్ లో ఉన్నాడు. ఫీదా మూవీ ఇచ్చిన బూస్టప్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో...

యంగ్ హీరో వరుణ్ తేజ్ మంచి స్పీడ్ లో ఉన్నాడు. ఫీదా మూవీ ఇచ్చిన బూస్టప్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. తొలిప్రేమ అంటూ బాబాయి క్రేజీ టైటిల్స్ తో వస్తోన్న వరుణ్..మరో కొత్త సినిమాను లైన్లో పెట్టాడు. నెక్ట్స్ మూవీలో అంతరిక్షంలో సాహసాలు చేయబోతున్నాడు. మోగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ లోనే చెప్పుకోదగ్గ మూవీ ఫిదా. హిట్ కోసం కెరీర్ స్టార్టింగ్ నుంచి తెగ ట్రై చేస్తోన్నవరుణ్ తేజ్ కు ఫిదా మూవీ పెద్ద బూస్టప్ లా నిలిచింది. ఈసినిమా ఇచ్చిన విజయంతో వరణ్ తేజ్ స్పీడ్ పెంచాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను సిద్దం చేస్తున్నాడు. తొలిప్రేమ సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తోన్నమరో మూవీని లైన్లో పెట్టాడు.

ఫిదా మూవీ తర్వాత వరణ్ తేజ్ చేస్తోన్న మూవీ తొలిప్రేమ. బాబాయి పవన్ కళ్యాణ్ హిట్ మూవీ టైటిల్ ను తన సినిమాకు వాడేసుకున్నాడు. ఈ టైటిల్ తో కాస్త సినిమాకు పబ్లిసిటీ అవుతుందనేది వరుణ్ తేజ్ ప్లాన్. టైటిల్ కు తగ్గట్టే..ఇది కూడా ప్రేమకథా చిత్రమే. వరుణ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 9న సినిమా రిలీజ్ కాబోతోంది.

తొలిప్రేమ సినిమాను రిలీజ్ కు సిద్ధం చేస్తూనే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వరుణ్. లవ్ స్టోరీలా దీన్ని కాస్త వెరైటీగా ప్లాన్ చేశాడు. అంతరిక్ష నేపథ్యంలో సినిమా ఉండబోతోంది. స్పేస్ థ్రిల్లర్ గా రాబోతోన్న ఈమూవీలో వరుణ్ వ్యోమగామి పాత్ర పోషించనున్నాడు. దీనికి ఘాజీ మూవీతో ప్రశంసలు అందుకున్న సంకల్ప దర్శకత్వం అందిచబోతున్నాడు. ఏప్రిల్ లో సినిమా పట్టాలెక్కనుంది. ఆలోపు వరుణ్ తేజ్ అమెరికా, బ్యాంకాంక్ లో శిక్షణ తీసుకోనున్నాడు.

Next Story