శ్రీదేవి కాళ్లు పట్టుకోబోయిన వర్మ.. అడ్డుకున్న వెంకటేష్

శ్రీదేవి కాళ్లు పట్టుకోబోయిన వర్మ.. అడ్డుకున్న వెంకటేష్
x
Highlights

తన ఆరాధ్య దేవత శ్రీదేవి హఠాన్మరణం పట్ల సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘అమ్మ బ్రహ్మ దేవుడో.. నీకేం పోయే కాలముచ్చిందిరో.. నా...

తన ఆరాధ్య దేవత శ్రీదేవి హఠాన్మరణం పట్ల సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘అమ్మ బ్రహ్మ దేవుడో.. నీకేం పోయే కాలముచ్చిందిరో.. నా కొంప ముంచావురో..’ అంటూ ట్వీట్ చేశారు. తాను దర్శకత్వం వహించిన క్షణం..క్షణం.. సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ తీపిగుర్తును ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో శ్రీదేవి ఒక అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చినందుకు పిధా అయిపోయిన వర్మ.. ఆమె కాళ్లకు దండం పెడుతుంటే.. విక్టరీ వెంకటేశ్ అడ్డుకుంటున్నాడని వర్మ ట్వీట్ చేశారు. ‘హే బాలాజీ.. నా ఆరాధ్య దేవతైన శ్రీదేవిని మాత్రమే ఎందుకు తీసుకెళ్లిపోయావు.. నన్ను మాత్రం ఎందుకు వదిలేశావు? అంటూ మరో ట్వీట్ చేశారు. తాను సినిమాల్లోకి రావాడానికి అసలు కారణం శ్రీదేవి అని, ఆమెను ప్రత్యక్షంగా దగ్గరనుంచి చూడాలని బలమైన కోరికతోనే సినిమాల్లోకి వచ్చినట్టు ట్వీట్ చేశారు. అందుకే క్షణం.. క్షణం సినిమాను శ్రీదేవికి ప్రేమలేఖగా అందించినట్టు వర్మ ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories