కేసీఆర్ నియోజక వర్గంలో హై టెన్షన్...

x
Highlights

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తున్న గజ్వేల్ ప్రజాకూటమి అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి నుంచి...

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తున్న గజ్వేల్ ప్రజాకూటమి అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బు పంచుతున్నారని, తన ఫోన్‌ను పోలీసులు ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపిస్తూ గజ్వేల్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట వంటేరు ప్రతాప్‌రెడ్డి దీక్షకు దిగారు. పోలీసులు ఈ దీక్ష భగ్నం చేసే సమయంలో ఒంటేరు సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆయనను సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రికి వంటేరు ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు ఆయన్ను డిశ్చార్జి చేశారు.

సాయంత్రం వరకు దీక్షలో ఉన్న ఆయన్ను గజ్వేల్‌ పోలీసులు అరెస్టు చేసి, గంట తర్వాత సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌ నుంచి వంటేరును ఎత్తుకుని ర్యాలీగా బయలుదేరారు. వంటేరు ఉన్నపళంగా సొమ్మసిల్లారు. ఆయన్ను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం ఆయనను సికింద్రాబాద్‌ యశోదకు తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామని అక్కడి వైద్యులు చెప్పడంతో విషయం తెలుసుకున్న కార్యకర్తలు గజ్వేల్‌లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

టీఆర్ఎస్ నేతలే పోలీసులతో కుమ్మక్కై తమ అభ్యర్థులపై దాడులు చేయిస్తున్నారని ప్రజాకూటమి నేతలు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కేసీఆర్‌ చేతిలో 19,029 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నర్సారెడ్డి 33,998 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రతాప్‌రెడ్డి, నర్సారెడ్డి ఇద్దరూ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అయితే, ఎన్నికల్లో గెలవడానికి టీఆర్‌ఎస్‌ అక్రమాలకు పాల్పడుతోందని మహాకూటమి నేతలు ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories