Top
logo

ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి మంచుతుఫాను, చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత

ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి మంచుతుఫాను, చార్‌ధామ్‌ యాత్ర నిలిపివేత
X
Highlights

ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు తుఫానులతో యాత్రీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన...

ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు తుఫానులతో యాత్రీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన ఆలయాలు అయిన ఛార్‌ధామ్‌, కేదర్‌నాథ్‌, బద్రీనాధ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు పేరుకుపోవడంతో భక్తులు అక్కడే చిక్కుకున్నారు. చార్‌ధామ్‌లో ప్రతికూల వాతావరణంతో ముగ్గురు యాత్రికులు మరణించారు. భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు NDRF బలగాలు ప్రయత్నిస్తున్నా ప్రతికూల వాతావరణంగా సాధ్యం కావడం లేదు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు తుఫానుతో కేధార్‌నాథ్‌ను అధికారులు నిలిపివేశారు. ప్రతికూల వాతావరణంతో లించౌలి, భీంబలి ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వాతావరణం అనుకూలించే వరకు యాత్రీకులను అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. బద్రీనాథ్‌, చార్‌ధామ్‌, హేమఖండ్‌ ప్రాంతాల్లో భారీగా పేరుకుపోయిన మంచును తొలగించేందుకు NDRF బలగాలను రంగంలోకి దింపారు. మరో వైపు రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆధికారులకు ఆందోళన కలిగిస్తున్నాయి.

Next Story