అప్పుతీర్చమన్నందుకు యువకుడిని చావగొట్టిన వ్యక్తి

అప్పు తీర్చమన్నందుకు ఒక యువకుడిని చావగొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని దేవరియాలో జరిగింది. ఓ యువకుడు నాసిర్...
అప్పు తీర్చమన్నందుకు ఒక యువకుడిని చావగొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని దేవరియాలో జరిగింది. ఓ యువకుడు నాసిర్ అన్సారీ అనే వ్యక్తికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. అయితే కొన్నాళ్లుగా అప్పు తీర్చకుండా లేట్ చేయడంతో ఆ యువకుడు నాసిర్ అన్సారీని నిలదీశాడు. గొడవ పెరగడంతో నాసిర్ పై చేయి చేసుకున్నాడు సదరు యువకుడు. దీంతో కోపం పెంచుకున్న నాసిర్ అన్సారీ తన స్నేహితులతో కలసి ప్లాన్ చేసి ఆ యువకుడిని చితక్కొట్టారు.
గ్రామానికి దూరంగా తీసుకెళ్లి అతి దారుణంగా కొట్టారు. చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. మరికొందరు వీడియో తీస్తూ ఆనందించారే తప్ప వద్దంటూ వారించలేదు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ విషయం పోలీసుల వరకు వెళ్లింది. బాధితుడిని పిలిపించి వివరాలు కనుక్కుని FIR రిజిస్టర్ చేశారు పోలీసులు. కీలక నిందితుడు నాసిర్ అన్సారీని అరెస్ట్ చేయగా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు దేవరియా పోలీసులు చెప్పారు.
Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMT
Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా
9 Aug 2022 10:49 AM GMTRashmika Mandanna: కష్టానికి అదృష్టం తోడైంది...
9 Aug 2022 10:39 AM GMTగోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు...
9 Aug 2022 10:22 AM GMTTelangana News: కన్నుల పండువగా.. ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
9 Aug 2022 10:13 AM GMTBigg Boss 6 Telugu: అప్పగింతల కాన్సెప్ట్‌తో 'బిగ్‌బాస్' ప్రోమో.....
9 Aug 2022 10:00 AM GMT