Top
logo

కాంగ్రెస్ జాబితా ఆలస్యంపై రాహుల్ అసంతృప్తి

X
Highlights

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఆలస్యం అవ్వడం ఆ పార్టీ పెద్దలకే చికాకు తెప్పిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్...

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఆలస్యం అవ్వడం ఆ పార్టీ పెద్దలకే చికాకు తెప్పిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల పర్వ మొదలైనా అభ్యర్థుల పేర్లు ఖరారు కాకపోవడంపై పార్టీ అధినేత రాహుల్ గాంధీ అసంతృప్తితో ఉన్నారు. రెండు నెలల నుంచి జరుగుతున్న అభ్యర్థల ఎంపిక కసరత్తు ఇంకా కొలిక్కి రాకపోవడంతో నేరుగా రాహుల్ గాంధీనే రంగంలోకి దిగారు. ఇప్పటివరకు ఖరారైన అభ్యర్థుల జాబితాతో పాటు, అభ్యర్థులు ఖరారుకాని స్ధానాల ఆశావహుల జాబితాను ఆసాంతం పరిశీలిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఏ ప్రాతిపదికన సట్లు కేటాయించారో రాహుల్ ఆరా తీస్తున్నారు. మూడు‌నెలల‌ క్రితం పార్టీలో చేరిన వారిలో ఎందరికి సీట్లు ఇచ్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో ఎంత మంది సీట్లు దక్కించుకున్నారు. ఏ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించారు. ఒకే కుటుంబంలో ఎంత మందికి సీట్లు ఇచ్చారు వంటి అంశాలపై రాహుల్ ఆరా తీస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో అనుసరించిన విధానం, అభ్యర్థుల సామర్థ్యం, గెలుపు అవకాశాలున్న అభ్యర్థుల జాబితాను రాహుల్ పరిశీలిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై అసహనంతో ఉన్న రాహుల్ గాంధీతో టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు ఇంఛార్జ్ కుంతియా తో పాటు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కాసేపట్లో భేటీ కాబోతున్నారు. అభ్యర్థుల ఎంపికలో అనుసరించిన మార్గదర్శకాలు, వడపోత గురించి రాహుల్ కు వివరించబోతున్నారు.

Next Story