శరణార్థులపై ట్రంప్ సర్కార్ విద్వేశం..

శరణార్థులపై ట్రంప్ సర్కార్ విద్వేశం..
x
Highlights

అమెరికా - మెక్సికో సరిహద్దుల్లో భీతావాహ వాతావరణం నెలకొనడంతో దిక్కుతొచని పరిస్థితితుల్లో ఎక్కడ నివాసించలేని దుస్థితిలో హోండరస్ దేశ శరణార్థులు అమెరికా...

అమెరికా - మెక్సికో సరిహద్దుల్లో భీతావాహ వాతావరణం నెలకొనడంతో దిక్కుతొచని పరిస్థితితుల్లో ఎక్కడ నివాసించలేని దుస్థితిలో హోండరస్ దేశ శరణార్థులు అమెరికా బాట పట్టారు. ఇదే క్రమంలో శరణార్ధుల రాకను గమనించిన అమెరికాన్లు ఎలాగైన విరిని తన్ని తరిమేయాలనుకున్నారేమో అనుకున్నదే ఆలస్యం వలస వస్తున్న వారిపై అమెరికాన్లు చెలరేగిపోయారు. వారిని అడ్డుకునేందుకు భాష్పవాయు గోళాలు ప్రయోగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. నెటిజన్లు, సోషల్ మీడియా అందరూ మూకుమ్మడిగా ట్రంప్ సర్కార్ పై దైమ్మెత్తు పొస్తున్నారు. ట్రంప్ అనుసరిస్తున్న ‘జరో టాలరెన్స్’ విధానం పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. పిల్లలపై కూడా భాష్పవాయు ప్రయోగం జరగడంతో కొందరు సొమ్మసిల్లిపడిపోయారు. మారియా మెజా అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి శరణార్థుల శిబిరం వైపు పరిగెడుతున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. దిని పై అమెరికా అధ్యక్షుడు డొనాడ్డ్ ట్రంప్ మాత్రం కూరలో కరివేపాకుల తీసిపారేసాడు. ఎవరో కావాలనే పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలపై మానవ హక్కుల నేతలు తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. హింస ఫొటోలు, వీడియోలు చూసి మాట్లాడాలని ట్రంప్ కు హితవు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories