logo
సినిమా

చరణ్ గైర్హాజరుపై క్లారిటీ ఇచ్చిన ఉపాసన

Highlights

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు హీరో రామ్ చరణ్ డుమ్మా కొట్టాడు. ఈ సదస్సుకి టాలీవుడ్ నుండి కొందరికి...

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు హీరో రామ్ చరణ్ డుమ్మా కొట్టాడు. ఈ సదస్సుకి టాలీవుడ్ నుండి కొందరికి మాత్రమే ఆహ్వానం అందింది. ఇన్విటేషన్ అందినవారిలో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. ఈ సదస్సులో చెర్రీ పాల్గొనాల్సి ఉన్నా, కొన్ని కారణాల వలన ఆయన గైర్హాజరు అయ్యారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా రాణిస్తూ, పలు వ్యాపారాలలో భాగస్వామిగా ఉన్నాడు రామ్ చరణ్ . చెర్రీ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి గల కారణాన్ని ఆయన సతీమణి ఉపాసన తెలిపింది. ఇతర కార్యక్రమాలలో తప్పని సరిగా పాల్గొనాల్సి రావడం కారణంగా రామ్ చరణ్ జీఎస్ఈ కి రాలేకపోతున్నారని వివరించారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్ హోదాలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకి ఉపాసన తొలి రోజు హాజరయ్యారు.

Next Story