విద్యాశాఖ మంత్రిని కొట్టిన ఆరోగ్యశాఖ మంత్రి !

విద్యాశాఖ మంత్రిని కొట్టిన ఆరోగ్యశాఖ మంత్రి !
x
Highlights

ఉపాధ్యాయుల బదిలీల అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య తలెత్తిన వివాదం ఒకరిపై ఒకరు దాడిచేసుకునే దాకా వెళ్లింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర...

ఉపాధ్యాయుల బదిలీల అంశంపై ఇద్దరు మంత్రుల మధ్య తలెత్తిన వివాదం ఒకరిపై ఒకరు దాడిచేసుకునే దాకా వెళ్లింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బన్‌సిందార్ బాజియా.. టీచర్ల బదిలీల గురించి మాట్లాడేందుకు విద్యాశాఖ మంత్రి వసుదేవ్ దేవ్‌నాని నివాసానికి వెళ్లారు. అక్కడ ఆ ఇద్దరు మంత్రుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సికర్ జిల్లాలోని ఖండేలా ప్రాంతానికి సంబంధించిన టీచర్ల బదిలీలో మంత్రి దేవ్‌నాని పక్షపాతం వహించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆరోపించారు. దీంతో ఆ ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అక్కడ జరిగిన వాగ్వాదంలో ఆరోగ్యశాఖ మంత్రి బాజియా తన తోటి మంత్రి అయిన దేవ్‌నాని చంప చెల్లుమనిపించినట్లు తెలిసింది. అయితే ఇందులో వాస్తవం ఏమీ లేదని, ఇదంతా సోషల్ మీడియా కథనాలే అని బాజియా అన్నారు. వసుంధరా రాజే ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories