ముంచుకొస్తున్న అతి తీవ్ర తుఫాను ముప్పు

ముంచుకొస్తున్న అతి తీవ్ర తుఫాను ముప్పు
x
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ గా మారింది. ‘తిత్ల్లీ’గా పేరు పెట్టిన ఈ తుఫాన్ ఒడిశాలోని గోపాల్‌పూర్‌, శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నంల మధ్య...

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ గా మారింది. ‘తిత్ల్లీ’గా పేరు పెట్టిన ఈ తుఫాన్ ఒడిశాలోని గోపాల్‌పూర్‌, శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నంల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో.. అన్ని మండల, డివిజన్‌ కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి అధికారులను ఆదేశించారు.

టిట్లీ తుపాను అతి తీవ్ర తుపానుగా మారడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయడంతో మరి కొన్నింటిని దారి మళ్లించింది. సికింద్రాబాద్‌-హవ్‌డా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్‌, బిలాస్‌పూర్‌ మీదుగా దారి మళ్లించారు. తుపాను ముప్పు నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం పూరీ, గంజామ్‌, గజపతి, జగత్‌సింగ్‌పూర్‌లోని విద్యాసంస్థలకు ముందస్తుగా సెలవులు ప్రకటించింది. జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. భువనేశ్వర్‌లోని ప్రత్యేక రిలీఫ్‌ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories