ఎన్నికల ప్రచారంపై టీఆర్ఎస్ బాస్ దృష్టి...అభ్యర్ధులకు ప్రచార సామగ్రి పంపిణీ

x
Highlights

ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతంగా చేపట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. 105 మంది అభ్యర్ధులకు ప్రచార సామగ్రి పంపిణీ చేసింది. సీఎం కేసీఆర్‌...

ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతంగా చేపట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. 105 మంది అభ్యర్ధులకు ప్రచార సామగ్రి పంపిణీ చేసింది. సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌ రెడ్డి పర్యవేక్షణలో 105 శాసనసభ నియోజకవర్గాలకు సామాగ్రిని తరలించారు. గ్రామగ్రామాన జరిగే అభ్యర్థుల ప్రచారం, వాహన ర్యాలీలు, బహిరంగ సభలకు అవసరమైన సామాగ్రి అభ్యర్ధులకు చేరింది.

టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారం సామాగ్రిని అభ్యర్దులకు పంచుతూ ప్రచారాన్ని విస్తృత పరిచేందుకు పార్టీ సమాయత్తం అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రజా ఆశీర్వాద సభల పేరు తో 50 రోజుల్లో 100 సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తొలి సభను హుస్నాబాద్ లో ఏర్పాటు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక త్వరలో నిర్వహించే 99 సభలపై దృష్టి సారించారు.

హుస్నాబాద్‌ సభ తర్వాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుడా వ్యవసాయ క్షేత్రానికేపరిమితమయ్యారు సీఎం కేసీఆర్. ఇక నుంచి వరుసగా సభల నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. అందులో భాగంగా ప్రచారం సామాగ్రి పంపిణీ పై దృష్టి పెట్టారు. ఉమ్మడి పది జిల్లాల్లో పది బహిరంగా సభలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. దసరా లోపు పాత పది జిల్లాలు కవర్ అయ్యేలా ప్రతి జిల్లాలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దసరా లోపు ఈ ప్రచారం ముగించి ఆ తరువాత మరో 30 నుంచి 40 సభలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దసరా తర్వాత మూడో దఫా ఎన్నికల ప్రచారంలో బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టనున్నారు. దక్షిణ తెలంగాణను టార్గెట్ చేస్తూ ప్రచార సభలు ఉండనున్నాయి. మరోవైపు సభలు నిర్వహణ లేని చోట బహిరంగ సభలకు తోడు 3d వాహనాలను టిఆర్ఎస్ పార్టీ వినియోగించనుంది. ఎన్నికల ప్రచారం భారం మొత్తం కెసిఆర్ తన భుజాలపై వేసుకున్నారు. బలహీనంగా ఉన్న అభ్యర్ధులను కూడా గెలిపించేందుకు కెసిఆర్ విస్తృతంగా ఆ యా నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories