Top
logo

వ్యవసాయానికి కేరాఫ్‌ నిజామాబాద్‌!

వ్యవసాయానికి కేరాఫ్‌ నిజామాబాద్‌!
X
Highlights

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ సభలో ఎంపీ కవిత ప్రసంగించారు....

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ సభలో ఎంపీ కవిత ప్రసంగించారు. కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ కవిత అన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి కేరాఫ్‌ అడ్రస్‌ నిజామాబాద్‌ జిల్లా అని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్‌ కరెంటు కోతలు లేకుండా చేశారని, ఇంటింటికీ నల్లాల కోసం రూ. 4వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో లక్షా 5వేల కేసీఆర్‌ కిట్‌లు పంపిణీ చేశామని, 4లక్షల 72వేలమంది రైతులకు రైతుబంధు చెక్కులు పంపిణీ చేశామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ హయాంలో నిజామాబాద్‌కు 292 పరిశ్రమలు వచ్చాయని తెలిపారు.

Next Story